నిద్రకు ముందు ఆ ఒక్క పని చేస్తే చాలు.. ఆరోగ్యంగా ఉండటానికి ఏ మెడిసిన్ అవసరం లేదు !

by Dishafeatures2 |
నిద్రకు ముందు ఆ ఒక్క పని చేస్తే చాలు.. ఆరోగ్యంగా ఉండటానికి ఏ మెడిసిన్ అవసరం లేదు !
X

దిశ, ఫీచర్స్ : ఉరుకులూ పరుగుల జీవితం, ఒత్తిడితో కూడిన దినచర్యలు, మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఇలా.. అనేక మంది చిన్న వయస్సులోనే అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇందుకు గల పలు కారణాల్లో సరైన నిద్రలేకపోవడం కూడా ఒకటిగా ఉంటోందని ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మెట్రోసిటీస్‌లో నివాసం ఉంటున్న 40 ఏండ్లలోపు వయస్సు గలవారిలో సంభవించే హెల్త్ ఇష్యూస్‌కు మెయిన్ రీజన్ క్వాలిటీ స్లీప్ లేకపోవడమేనని వైద్య నిపుణుుల చెప్తున్నారు.

సరైన నిద్రలేకపోవడం లేదా చాలా తక్కువ సమయమే నిద్రపోవడం అనే పరిస్థితి దీర్ఘకాలంపాటు కొనసాగితే బాధితుల్లో డయాబెటిస్, ఒబేసిటీ, గ్యాస్ట్రిక్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు చిన్న వయస్సులోనే సంభవించే ప్రమాదం పెరుగుతుందని కూడా నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఎంతో మంది ఈ విధమైన జీవనశైలివల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా నిద్రలేమి డిప్రెషన్, యాంగ్జైటీ, ఇతర తీవ్రమైన మానసిక రుగ్మతలకు కూడా దారితీస్తుంది. అందుకే ప్రతిరోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలని, కనీసం ఆరుగంటలైనా నిద్రపోవడం మంచిదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. పలు అనారోగ్యాలకు నిద్రలేమి కారణం అవుతుందన్న విషయం తెలిసినప్పటికీ తమకు నిద్రపట్టడం లేదని కొందరు ఆందోళన చెందుతుంటారు. అయితే ఇలాంటివారు తమ రోజువారి దినచర్యలతో పాటు రాత్రి నిద్రపోయేకంటే ముందు కొన్ని టిప్స్ ఫాలో అయితే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

*నిద్ర బాగా పట్టాలంటే వ్యాయామాలు, శారీరక శ్రమతోపాటు సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. తాజా పండ్లు ఎక్కువగా తీసుకుంటూ పిండి పదార్థాలు, స్వీట్లు, కొవ్వు పదార్థాలు తగ్గించాలి. అలాగే సాయంత్రం తర్వాత టీ, కాఫీ, కెఫిన్ అధికంగా ఉండే ఇతర పానీయాలు తీసుకోవద్దు.

* నిద్రపోయే ముందు ఫోన్, ల్యాప్, టాప్, ఇతర స్క్రీన్లను చూడటంవల్ల నిద్ర పట్టదు. అలాగే మధ్యలో మేల్కొన్నప్పుడు కొందరు మొబైల్ ఫోన్ చెక్ చేస్తుంటారు. దీనివల్ల కూడా తిరిగి నిద్రపట్టదు. కాబట్టి ఆ పని చేయవద్దని నిపుణులు పేర్కొంటున్నారు.

*ఇక నిద్రలేమితో ఇబ్బంది పడేవారు రాత్రి డిన్నర్ తర్వాత వాకింగ్ చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఈ సమయంలో నడకవల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి క్వాలిటీ స్లీప్‌ను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్రపోయే ముందు ప్రతి ఒక్కరూ ఈ ఒక్కపని తప్పక చేయాలని, దీంతో ఏ మెడిసిన్ అవసరంగా లేకుండానే ఆరోగ్యంగా ఉండగలుగుతారని నిపుణులు చెప్తున్నారు.



Next Story