- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Layoffs: ఉద్యోగుల లేఆఫ్స్‌కు కంపెనీలే బాధ్యత వహించాలి
ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్(నైట్స్) స్పందించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం జాబ్ మార్కెట్లో టెక్ కంపెనీలు లేఆఫ్స్ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కారణంగా చూపి కంపెనీలు వేలాది మందిని చెప్పాపెట్టకుండా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాయి. తాజాగా గ్లోబల్ టెక్ కంపెనీ ఒరాకిల్ కూడా ఒక్కసారిగా 30 వేల మందిని ఉన్నపళంగా తొలగించింది. ఒక్క మనదేశంలోనే 12 వేల మందిని తీసేయడంతో ఈ అంశం అతిపెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్(నైట్స్) స్పందించింది. ఉద్యోగులకు సంబంధించిన బాధ్యత కంపెనీలదే. ఏఐ లాంటి టెక్నాలజీ కోసం ఖర్చు చేస్తున్నప్పుడు ఉద్యోగులకు అవసరమైన స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా వారి బాధ్యతే అవుతుందని అభిప్రాయపడింది. లేఆఫ్స్ నిర్ణయం తీసుకోవడం కంటే వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సూచించింది. ముఖ్యంగా లేఆఫ్స్ విషయంలో నోటీస్ పీరియడ్, పరిహారం, యాజమాన్య బాధ్యత వంటి అంశాలను చూడాలని డిమాండ్ చేసింది.






