- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టాక్ మార్కెట్ మోసాలకు చెక్.. సెబీ సరికొత్త అస్త్రం 'పర్వా'
గత కొంత కాలంగా భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను లక్ష్యంగా చేసుకొని పలువురు మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలంగా భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను లక్ష్యంగా చేసుకొని పలువురు మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మోసాలు అధికమైన క్రమంలో ఇన్వెస్టర్ల రక్షణ కోసం సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో ముందడుగు వేసిన సెబీ.. మార్కెట్ మధ్యవర్తులు (Market Intermediaries) చెప్పే లాభాల గణాంకాలను స్వతంత్రంగా ధృవీకరించేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా 'పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీ' (PaRRVA - పర్వా)ను సోమవారం ఆవిష్కరించింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE), కేర్ ఎడ్జ్ (CAREEdge) రేటింగ్స్ భాగస్వామ్యంతో సెబీ ఈ వినూత్న విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఈ కొత్త వ్యవస్థ ప్రస్తుతం సోషల్ మీడియాలో అనధికారిక వ్యక్తులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు తాము భారీ లాభాలు సాధించామంటూ నకిలీ, అవాస్తవ గణాంకాలతో ఇన్వెస్టర్లను మభ్యపెడుతున్నారు. మరోవైపు, సెబీ వద్ద రిజిస్టర్ అయిన నిజమైన అడ్వైజర్లు (Investment Advisors), రీసెర్చ్ అనలిస్టులు తమ గత పనితీరును (Past Performance) చూపించుకోవడానికి నిబంధనలు అంగీకరించేవి కావు. దీనివల్ల ఇన్వెస్టర్లు ఎవరిని నమ్మాలో తెలియక మోసగాళ్ళ వలలో చిక్కుకుంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే 'పర్వా' (PaRAVA)ను తీసుకొచ్చారు.
'పర్వా' ఎలా పనిచేస్తుంది?
ఈ కొత్త వ్యవస్థ ద్వారా, సెబీ రిజిస్టర్డ్ మధ్యవర్తులు తమ గత రిటర్న్స్ (లాభాల వివరాలు)ను ఈ ఏజెన్సీ ద్వారా ధృవీకరించుకోవచ్చు. 'పర్వా' ఆ గణాంకాలను క్షుణ్ణంగా పరిశీలించి, అవి నిజమని తేలితేనే సర్టిఫై చేస్తుంది. ఇలా ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే ఇన్వెస్టర్లకు చూపించాల్సి ఉంటుంది. దీనివల్ల ఇన్వెస్టర్లకు పారదర్శకమైన, నమ్మదగ్గ సమాచారం అందుతుంది.
ప్రపంచంలోనే తొలిసారి
ఈ సందర్భంగా సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే మాట్లాడుతూ.. "ఇన్వెస్టర్ల నిర్ణయాలను ప్రభావితం చేసే తప్పుడు క్లెయిమ్‌లను అరికట్టడమే దీని లక్ష్యం. అన్-రిజిస్టర్డ్ వ్యక్తుల ప్రచారాలకు అడ్డుకట్ట వేసి, సెబీ రిజిస్టర్డ్ నిపుణులకు న్యాయం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి స్వతంత్ర వెరిఫికేషన్ మెకానిజం ప్రవేశపెట్టిన తొలి దేశం భారత్ కావడం విశేషం" అని పేర్కొన్నారు.
ఇన్వెస్టర్ల భద్రతే ముఖ్యం
ఇటీవల సెబీ నిర్వహించిన సర్వే ప్రకారం, కేవలం 36% మంది ఇన్వెస్టర్లకు మాత్రమే మార్కెట్ పై సరైన అవగాహన ఉంది. ఏకంగా 62% మంది ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి, 23% మంది త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో రిస్క్ తెలియకుండానే పెట్టుబడులు పెడుతున్నారు. 'పర్వా' రాకతో ఇన్వెస్టర్లు సరైన డేటాను చూసి, రిస్క్ అంచనా వేసుకుని తెలివైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది.






