- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Price: ప్రధాన జ్యువెలరీ దుకాణాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..!
గత కొన్నేళ్లుగా బంగారం ఇచ్చిన రాబడి కూడా అత్యధికంగా ఉండటంతో ఎక్కువమంది పెట్టుబడి సాధనంగా కూడా పరిగణిస్తున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. పండుగ సీజన్ కూడా మొదలవడంతో చాలామంది ధరలతో సంబంధం లేకుండా కొనడానికి ఇష్టపడుతున్నారు. గత కొన్నేళ్లుగా బంగారం ఇచ్చిన రాబడి కూడా అత్యధికంగా ఉండటంతో ఎక్కువమంది పసిడిని ప్రీమియం పెట్టుబడి సాధనంగా కూడా పరిగణిస్తున్నారు. రాబోయే అక్టోబర్ నెలలో దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలు ఉన్న నేపథ్యంలో పండుగ సెంటిమెంట్ కోసమైనా చాలామంది బంగారం ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తున్నారు. ఈ పండుగల సమయంలో సాంప్రదాయంలో భాగంగా ఆభరణాలు, నాణేలు, కడ్డీలను కొనడం సహజం. ఈ క్రమంలో దేశంలో వివిధ నగరాల్లో ప్రధాన జ్యువెలరీ స్టోర్లలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
స్థానిక సరఫరా, డిమాండ్, రాష్ట్ర పన్నులు వంటి అంశాల కారణంగా దేశంలోని వివిధ నగరాలు, ఆభరణాల దుకాణాల్లో బంగారం ధరలు ఒకేలా ఉండవు. ధరల్లో స్వల్ప తేడా ఉంటుంది. సెప్టెంబర్ 28 (సాయంత్రం 4 గంటలు) నాటికి కొన్ని ప్రముఖ ఆభరణాల బ్రాండ్ల 22 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిద్దాం. ఈ రేట్లు ఎప్పటికప్పుడు మారవచ్చు. అంతేకాకుండా ఈ రేట్లలో తయారీ, ఇతర ఛార్జీలు ఉండవు. నగరాన్ని బట్టి ధరలు మారవచ్చు.
తనిష్క్‌లో 22 క్యారెట్ల బంగారం ధర
సెప్టెంబర్ 28 నాటికి 22 క్యారెట్ల బంగారు ఆభరణాల పది గ్రాము గ్రాములు రూ. 1,06,250 ఉంది.
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో
సెప్టెంబర్ 27 సాయంత్రం నాటికి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 22 క్యారెట్ల ఆభరణాల ధర పది గ్రాములకు రూ. 1,05,850గా ఉంది.
జోయాలుక్కాస్‌లో
సెప్టెంబర్ 28 నాటికి, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌లోని ఆన్‌లైన్ స్టోర్‌లలో 22 క్యారెట్ల బంగారు ఆభరణాలకు జోయాలుక్కాస్ ధర పది గ్రాములు రూ. 1,05,850 ఉంది.
జీఆర్‌టీ జ్యువెలర్స్‌లో
సెప్టెంబర్ 27 సాయంత్రం నాటికి జీఆర్‌టీ జ్యువెలర్స్ 22 క్యారెట్ల ఆభరణాల ధర పది గ్రాములకు రూ. 1,05,850గా ఉంది.
కళ్యాణ్ జ్యువెలర్స్ లో 22 క్యారెట్ల బంగారం ధర
సెప్టెంబర్ 28 నాటికి హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీలలో కళ్యాణ్ జ్యువెలర్స్ 22 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర పది గ్రాములు రూ. 1,05,850గా ఉంది.
పండుగ సీజన్ సమయంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలనుకునే వారు తప్పనిసరిగా హాల్‌మార్క్ చేసిన ఆభరణాలను కొనాలని మర్చిపోవద్దు. బంగారం, వెండి స్వచ్ఛతకు సంబంధించి ఎలాంటి నకిలీల బారిన పడకుండా వినియోగదారులను రక్షించడం హాల్‌మార్కింగ్ తప్పనిసరి.
హాల్‌మార్కింగ్ అంటే
బంగారు ఆభరణాల నాణ్యతను సూచించేదే హాల్‌మార్కింగ్. అంటే ఆభరణాల్లో ఉండే బంగారం ఎంత అనే విషయాన్ని హాల్‌మార్క్ ద్వారా తెలుసుకునే అధికారిక రికార్డింగ్. ఆభరణాలను తయారు చేసిన తర్వాత హాల్‌మార్కింగ్ కోసం పంపిస్తారు. అక్కడ నగల్లో ఉన్న బంగారం శాతాన్ని పరీక్షించి హాల్‌మార్క్ ముద్ర వేస్తారు.
వేటికి హాల్‌మార్క్ వరిస్తుందంటే
ప్రస్తుతం దేశంలో రెండు విలువైన లోహాలకు ఈ హాల్‌మార్కింగ్ విధానం అమలవుతోంది. బంగారం, వెండి దీని పరిధిలోకి వస్తాయి.
దీన్ని ఎలా గుర్తించవచ్చు
బీఐఎస్ కేర్ యాప్‌లో 'వెరిఫై హెచ్‌యూఐడీ' ఫీచర్‌ని ఉపయోగించి కస్టమర్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ) నంబర్‌ను ధృవీకరించవచ్చు. దీని ఆభరణాల వ్యాపారి రిజిస్ట్రేషన్ నంబర్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.






