ఓలా, ఉబర్‌కు షాక్.. రంగంలోకి భారత్ టాక్సీ

by Muthe.Rajitha |

ఓలా, ఉబర్‌కు భారీ షాక్ తగలనుంది. ప్రస్తుతం టాక్సీ రంగంలో ఉన్న ఓలా, రాపిడో, ఉబర్‌కు పోటీగా కేంద్ర ప్రభుత్వం భారత్ ట్యాక్సీని తీసుకొచ్చింది.

ఓలా, ఉబర్‌కు షాక్.. రంగంలోకి భారత్ టాక్సీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఓలా, ఉబర్‌కు భారీ షాక్ తగలనుంది. ప్రస్తుతం టాక్సీ రంగంలో ఉన్న ఓలా, రాపిడో, ఉబర్‌కు పోటీగా కేంద్ర ప్రభుత్వం భారత్ ట్యాక్సీని తీసుకొచ్చింది. సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ కలిసి అభివృద్ధి చేసిన సహకార ట్యాక్సీ సర్వీస్ ఇది. అయితే ముందుగా దీని పైలట్ ప్రాజెక్టును ఢిల్లీలో నవంబరు నుంచి మొదలుపెట్టనున్నారు. తొలుత 650 మంది సొంత వాహనాలు కలిగిన డ్రైవర్ల సేవలు వినియోగించనున్నారు. రాజధాని నగరంలో విజయవంతమైతే డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

అయితే ఈ సేవల గురించి గతంలోనే అమిత్ షా ప్రకటించారు. సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ కింద 2025 జూన్‌లో ఈ సంస్థను ఏర్పాటు చేయగా.. వచ్చే నెలనుంచి భారత్ టాక్సీ సేవలు మొదలుకానున్నాయి. టూ వీలర్లు, ఆటోలు, ఫోర్ వీలర్లు ఇందులో భాగమై సేవలు అందిస్తాయి. లాభాలు డ్రైవర్లకు మాత్రమే చేరుతాయి. ఇప్పటికే ఉన్న వివిధ ట్యాక్సీ సర్వీసులపై వినియోగదారులు, డ్రైవర్ల నుంచి వస్తున్న ధరలు, క్యాన్సిలేషన్లు, 25 శాతం కమీషన్ వంటి ఆరోపణలు, సమస్యలకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం దీనిని తీసుకు వస్తోంది.

ఇందులో డ్రైవర్లు ఎలాంటి కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. మెంబర్‌షిప్ కింద నామమాత్రపు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. 2026 మార్చి నాటికి మెట్రో నగరాల్లో, 2030 నాటికి లక్ష మంది డ్రైవర్లను ఈ ప్లాట్‌ఫామ్‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story