Ciment Prices: ధరలు పెంచిన సిమెంట్ కంపెనీలు

by S Gopi |

డీలర్ల మార్జిన్లను తగ్గిపోవడం, లాభాలపై ప్రభావం చూపించిన నేపథ్యంలోనే కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

Ciment Prices: ధరలు పెంచిన సిమెంట్ కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా సిమెంట్ తయారీ కంపెనీలు ధరలను పెంచాయి. గడిచిన నాలుగు నెలలుగా సిమెంట్ ధరలు స్థిరంగా ఉండటంతో పాటు డీలర్ల మార్జిన్లను తగ్గిపోవడం, లాభాలపై ప్రభావం చూపించిన నేపథ్యంలోనే కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రియల్ ఎస్టే ట్ రంగం నుంచి డిమాండ్ పెరగడం, పండుగ సీజన్ తర్వాత కార్మికులు అందుబాటులో ఉండటం, మౌలిక సదుపాయాల రంగం నుంచి ఆర్డర్లు పెరగడంతో కంపెనీ డిసెంబర్ నెలలో పెంపు నిర్ణయాన్ని అమలు చేశాయని డీలర్లు తెలిపారు. ఈ ధరల పెంపు నిర్ణయం దేశవ్యాప్తంగా ఉండగా, పశ్చిమ భారత్‌లో ధరల పెరుగుదల అత్యధికంగా ఉన్నాయి. 50 కిలోల బస్తాకు దాదాపు రూ. 5-10 వరకు పెంచారు. మిగిలిన దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో ధరలు అత్యధికంగా పెంచారు. పశ్చిమ, ఉత్తర భారతంలో కొంత తక్కువ పెంపు అమలు చేశారు. దక్షిణాదిలో సిమెంట్ ధరల పెరుగుదల చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి డీలర్లు అనేక బ్రాండ్ల ధరలను బ్యాగ్‌కు రూ. 40 వరకు పెంచారు. చెన్నైకి చెందిన ఓ బడా సిమెంట్ డిస్ట్రిబ్యూటర్ 50 కిలోల సిమెంట్ బస్తాను దాదాపు రూ. 320కి తీసుకెళ్లినట్టు చెప్పారు.

Next Story