HDFC లిమిటెడ్‌, HDFC బ్యాంక్ విలీనానికి CCI ఆమోదం

by Disha Web Desk 17 |
HDFC లిమిటెడ్‌, HDFC బ్యాంక్ విలీనానికి CCI ఆమోదం
X

ముంబై: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, దాని మాతృ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ విలీన ప్రతిపాదనను ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) ఆమోదించింది. "హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి ఇన్వెస్ట్‌మెంట్స్, హెచ్‌డిఎఫ్‌సి హోల్డింగ్‌ల కలయికతో కూడిన విలీన ప్రతిపాదితనకు ఆమోదించినట్లు సిసిఐ శుక్రవారం ఒక ట్వీట్‌లో" తెలిపింది. మొదటి దశలో హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్‌తో హెచ్‌డిఎఫ్‌సి ఇన్వెస్ట్‌మెంట్స్, హెచ్‌డిఎఫ్‌సి హోల్డింగ్‌లను విలీనం చేస్తుంది. తరువాత, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్‌ను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో విలీనం చేస్తుంది.

ఈ విలీనంతో, HDFC లిమిటెడ్ బాధ్యతలు HDFC బ్యాంక్‌కి బదిలీ చేయబడతాయి. ప్రస్తుతం కొనసాగుతున్న విలీన ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 12-18 నెలల సమయం పడుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ విలీన ప్రతిపాదనను ప్రకటించాయి. 68 మిలియన్లకు పైగా కస్టమర్లు, 6,342 శాఖలను కలిగి ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రస్తుతం దేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్‌గా ఉంది.

SBI వినియోగదారులకు గుడ్‌ న్యూస్: ఫిక్స్డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేటు


Next Story

Most Viewed