SBI వినియోగదారులకు గుడ్‌ న్యూస్: ఫిక్స్డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేటు

by Disha Web Desk 17 |
SBI వినియోగదారులకు గుడ్‌ న్యూస్: ఫిక్స్డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేటు
X

ముంబై: దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వినియోగదారులకు శుభవార్త అందించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. పెంచిన ఈ వడ్డీ రేట్లు ఆగస్టు 13 నుంచి అమల్లోకి వస్తాయి. 7 రోజుల నుంచి మొదలుకుని 10 ఏళ్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపును ప్రకటించింది. 60 సంవత్సరాలు దాటిన వారికి అదనంగా 0.5 శాతం వడ్డీ ఇస్తుంది.

7 రోజుల నుండి 45 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై, బ్యాంక్ 2.9% వడ్డీ రేటును అందిస్తుంది. 46 రోజుల నుండి 179 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై 3.9% వడ్డీ రేటు, 180 రోజుల నుండి 210 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇంతకుముందు వడ్డీ రేటు 4.4 శాతంగా ఉంది, కానీ ఇప్పుడు 15 బేసిస్ పాయింట్ల పెంపు నిర్ణయంతో వడ్డీ రేటు 4.55% చేరింది. 1 సంవత్సరం లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.6% వడ్డీ రేటు ఉంది.

1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై గతంలో ఉన్న 5.3 శాతం వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్లు పెంచి ఇప్పుడు 5.45% చేశారు. మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 5.45% నుండి 5.60% వరకు పెంచింది. అంటే బ్యాంకు 15 బేసిస్ పాయింట్ల పెంపు నిర్ణయం తీసుకుంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.5 శాతం నుంచి 5.65 శాతానికి పెంచారు.

సీనియర్ సిటిజన్లకు 7 రోజుల నుండి 5 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనంగా 0.5 శాతం వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రత్యేకంగా " SBI Wecare" డిపాజిట్ పథకం కింద ప్రస్తుతం ఉన్న 50 బేసిస్ పాయింట్లకు అదనంగా 30 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ ఇస్తుంది. 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాల వ్యవధికి మాత్రమే ఇది చెల్లించబడుతుంది. 30 సెప్టెంబర్, 2022 వరకు ఈ స్కీం అమలులో ఉంటుంది.

HDFC లిమిటెడ్‌, HDFC బ్యాంక్ విలీనానికి CCI ఆమోదం



Next Story

Most Viewed