- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NPPA: గుండె సంబంధిత వైద్యం మరింత ఖరీదు ..పెరిగిన కరొనరీ స్టెంట్ ధరలు
దీనివల్ల కరొనరీ స్టెంట్ల ధరలు దాదాపు 2 శాతం మేర పెరగనున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: గుండె సంబంధిత రోగులకు వైద్యం ఖరీదు కానుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గుండె జబ్బులకు వాడే కరోనరీ స్టెంట్‌ల ధరలను పెంచేందుకు దేశ ఔషధ ధరల నియంత్రణ సంస్థ(ఎన్‌పీపీఏ) అంగీకరించింది. ఈ మేరకు వాటి తయారీదారులకు, దిగుమతి చేసుకునే కంపెనీలకు అనుమతిలిచ్చింది. దీనివల్ల కరొనరీ స్టెంట్ల ధరలు దాదాపు 2 శాతం మేర పెరగనున్నాయి. టోకు ధరల్లో మార్పుల ఆధారంగా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్(ఎన్ఎల్ఈఎం)లోని షెడ్యూల్డ్ ఔషధాల ధరలను పెంచేందుకు తయారీ కంపెనీలకు ఎన్‌పీపీఏ తెలిపింది. ధరల మార్పు తర్వాత బేర్ మెటల్ స్టెంట్‌ల సీలింగ్ ధర యూనిట్‌కు రూ. 10,692.69కి పెరుగుతుంది. అలాగే, ఎల్యూటింగ్, బయోమెటాలిక్, బయోరిసోర్బబుల్ వాస్కులర్ స్కాఫోల్డ్(బీవీఎస్) స్టెంట్‌ల ధర యూనిట్‌కు రూ. 38,933.14గా ఉంటుంది. ఇదే సమయంలో తయారీదారులు అందించిన ధరల జాబితాను రిటైలర్లు, డీలర్లు తమ వ్యాపార ప్రాంగణాల్లో కనిపించేలా ఉంచాలని ఎన్‌పీపీఏ స్పష్టం చేసింది. సాధారణంగా హృదయ సంబంధిత వ్యాధులను భారంగా భావించే సామాన్యులకు ఖర్చులు పెరగడం కొంత ఆందోళన కలిగించే అంశం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) డేటా ప్రకారం.. 2022లో 32,457 మంది గుండెపోటు కారణంగా మరణించారు. 2021లో నమోదైన 28,413 మరణాల కంటే 12.5 శాతం పెరిగాయి.






