- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CAFE Norms: వచ్చే ఏప్రిల్ నుంచే కేఫ్ 3 నిబంధనలు
ఏప్రిల్ 1 నుంచి వాహన తయారీదారులు కఠిన ఇంధన సామర్థ్య నిబంధనలను పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు

దిశ, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ 3(కేఫ్ 3) ప్రమాణాల అమలు గడువును ప్రభుత్వం పొడిగించే అవకాశం లేదని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి హనీఫ్ ఖురేషి సోమవారం తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి వాహన తయారీదారులు కఠిన ఇంధన సామర్థ్య నిబంధనలను పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేఫ్ 3 నిబంధనలపై ప్రభుత్వం ఆటో పరిశ్రమ భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది, వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ, అభిప్రాయాలను క్రమం తప్పకుండా కోరుతున్నామన్నారు. అమలు గడువును 2027, ఏప్రిల్ 1 తర్వాత పొడిగించాల్సిన అవసరం రాకపోవచ్చని ఆయన అన్నారు. కాగా, 'కేఫ్-2027'గా పిలిచే ఈ నిబంధనల ప్రకారం, ప్రతి కారు అన్ని మోడళ్ల సగటు ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ, కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్ నిర్దిష్ట స్థాయి కంటే తక్కువగా ఉండాలి. మరింత సులభంగా చెప్పాలంటే.. వాహనాలు తక్కువ ఇంధనం, తక్కువ కాలుష్యం వాడాలి. మెరుగైన మైలేజీ ఇవ్వాలి.






