- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cyber Fraud: కొత్త తరహా సైబర్ స్కామ్..ఒక్క క్లిక్‌తో రూ. 6 లక్షల మోసం
గుర్తుతెలియని వ్యక్తి నుంచి తనకు వాట్సాప్‌లో నకిలీ ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్‌టీఓ) ఈ-చలాన్ ఏపీకే ఫైల్‌ను వచ్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయని అనేక నివేదికలు హెచ్చరిస్తున్నాయి. వాటిలో ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కాములతో పాటు ఫేక్ జాబ్ ఆఫర్లు, నకిలీ లింకుల బెడదే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా బెంగళూరులో సైబర్ స్కామర్లు ఒక్క క్లిక్‌తో ఓ వ్యాపారవేత్తకు సుమారు రూ. 6 లక్షలు బురిడి కొట్టించారు. బెంగళూరుకు చెందిన 64 ఏళ్ల వ్యాపారవేత్త రవి కుమార్ వాట్సాప్‌లో తనకు పంపిన ఈ-చలాన్ ఏపీకే ఫైల్‌పై క్లిక్ చేయడంతో ఒక్కసారిగా ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ. 5,81,500 పోయాయని ఫిర్యాదు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తి నుంచి తనకు వాట్సాప్‌లో నకిలీ ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్‌టీఓ) ఈ-చలాన్ ఏపీకే ఫైల్‌ను వచ్చింది. అది ఆర్‌టీఓ నుంచేవచ్చిందని భావించి, పూర్తి సమాచారం తెలుసుకునే క్రమంలో క్లిక్ చేసిన వెంటనే, తన రెండు సేవింగ్స్ ఖాతాల నుంచి రూ. 5,81,500 డిడక్ట్ అయ్యాయని రవి కుమార్ వివరించారు.
ఈ ఘటనకు సంబంధించి బాధితుడు రవి కుమార్ ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 318 (మోసం) కింద సదరు నకిలీ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, సైబర్ స్కామర్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్లో మోసగిస్తున్నారు. ఏపీకే ఫైల్స్‌ను మెసేజ్, వాట్సాప్, ఈ-మెయిల్ లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి పంపడం ద్వారా బాధితుల వ్యక్తిగత, బ్యాంకింగ్ వంటి ఆర్థిక సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. అటువంటి మెసేజ్‌లు, నకిలీ లింకులను క్లిక్ చేయడానికి ముందు సరిచూసుకోవాలి. పర్సనల్ డేటా, ఆర్థిక వివరాలు చోరీకి గురికాకుండా రక్షణ కోసం తెలియని నంబర్ల నుంచి వచ్చే ఎలాంటి ఏపీకే ఫైల్స్‌నైనా క్లిక్ చేయకుండా ఉండటం మంచిదని పోలీసు అధికారులు పేర్కొన్నారు.






