Scheme: బ్యాంకు కన్నా ఎక్కువ వడ్డీ ఇచ్చే స్కీం ఇదే...రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో కూడిన బంపర్ ఆఫర్..!!

by Vennela |

Scheme: ప్రస్తుతం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లపై అతి తక్కువగా వడ్డీ లభిస్తోంది

Scheme: బ్యాంకు కన్నా ఎక్కువ వడ్డీ ఇచ్చే స్కీం ఇదే...రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో కూడిన బంపర్ ఆఫర్..!!
X

దిశ, వెబ్ డెస్క్: Scheme: ప్రస్తుతం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లపై అతి తక్కువగా వడ్డీ లభిస్తోంది. ముఖ్యంగా ఎవరైతే ఫిక్స్ డిపాజిట్లు పైన ఆధారపడి జీవిస్తున్నారో వారికి బ్యాంకులు తగ్గించిన వడ్డీలు ఒకరకంగా చెప్పాలంటే షాక్ అని చెప్పవచ్చు. చాలావరకు వృద్ధులు అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువగా తమ కష్టార్జితాన్ని పిఎఫ్ డబ్బులు అదే విధంగా గ్రాట్యూటీ డబ్బులను బ్యాంకుల్లో ఫిక్స్ చేసి దానిపై వచ్చే వడ్డీని పెన్షన్ గా తీసుకొని జీవితం వెళ్లదీస్తుంటారు.

కానీ ప్రస్తుతం ఆర్బీఐ కీలకమైన రెపోరేట్లను తగ్గించడంతో బ్యాంకులు కూడా ఫిక్స్ డిపాజిట్ ల పైన వడ్డీ రేట్లను తగ్గించాయి. అయితే బ్యాంకులు ఫిక్స్ డిపాజిట్ లపై రేట్లు తగ్గించినప్పటికీ, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లు బ్యాంకుల కన్నా కూడా ఎక్కువ వడ్డీని రిటర్న్ అందిస్తున్నాయి. అలాంటి ఓ స్కీం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళనాడు పవర్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (TNPFIDCL) అనేది తమిళనాడు ప్రభుత్వానికి చెందిన ఒక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC). ఇది ముఖ్యంగా పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించడానికి స్థాపించారు. ఇది డిపాజిట్ తీసుకునే సంస్థగా రిజిస్టర్ చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యానికి చెందిన, తమిళనాడు ప్రభుత్వానికి చెందిన సంస్థ.

TNPFIDCL రెండు రకాల FD స్కీములను అందిస్తుంది: క్యూములేటివ్ FD: వడ్డీ మొత్తాన్ని FD పరిపక్వత సమయంలో ఒకేసారి చెల్లిస్తుంది. నాన్-క్యూములేటివ్ FD: వడ్డీ మొత్తాన్ని నెలవారీ, త్రైమాసిక, లేదా వార్షికంగా చెల్లిస్తుంది. ఇందులో కనిష్ట పెట్టుబడి రూ. 50,000, గరిష్ట పెట్టుబడి రూ. 5 కోట్లుగా ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టడానికి కాలపరిమితి: 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాలుగా ఉంది.

దీనిపై కనీస వడ్డీ 8.10 శాతం నుంచి గరిష్టంగా 8.80 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. ఇందులో సీనియర్ సిటిజన్ల పేరిట ఫిక్స్ చేస్తే అదనంగా 0.50% వడ్డీ రేటు లభిస్తుంది. ఈ FDపై లోన్ పొందే అవకాశం ఉంది. TNPFIDCL అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో FD కోసం అప్లై చేయవచ్చు. దీనికి సంబంధించిన వెబ్ సైట్ tnpowerfinance.com ఇదే. TNPFIDCL ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీములు స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారికి చాలా వరకూ అనుకూలంగా ఉంటాయి. అయితే మీరు పెట్టుబడి చేసే ముందు ఈ స్కీములకు సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్లను, రేటింగ్‌లను, ఇతర నియమ నిబంధనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మంచిదని గుర్తించాలి.

Next Story