బీఎస్ఎన్ఎల్ సంచలన ఆఫర్.. కేవలం ఒక్క రూపాయికే 30 రోజుల వ్యాలిడిటీ

by Malleboina Mahesh |

ప్రైవేట్ టెలికాం సంస్థల రీఛార్జ్ ధరల పెంపుతో బెంబేలెత్తుతున్న సామాన్యులకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తీపి కబురు అందించింది.

బీఎస్ఎన్ఎల్ సంచలన ఆఫర్.. కేవలం ఒక్క రూపాయికే 30 రోజుల వ్యాలిడిటీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రైవేట్ టెలికాం సంస్థల రీఛార్జ్ ధరల పెంపుతో బెంబేలెత్తుతున్న సామాన్యులకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తీపి కబురు అందించింది. కేవలం ఒక్క రూపాయికే 30 రోజుల వ్యాలిడిటీ అందించే సరికొత్త ‘ఫ్రీడమ్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. తన 4G నెట్‌వర్క్ సామర్థ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ ఈ భారీ ఆఫర్‌ను ప్రకటించింది.

అయితే, ఈ ఆఫర్ ప్రధానంగా కొత్త సిమ్ (New Sim) తీసుకునే వారికి, ఇతర నెట్‌వర్క్‌ల నుండి బీఎస్ఎన్ఎల్‌కు మారే (MNP) కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు ఉచితంగా 4G సిమ్ కార్డును కూడా పొందవచ్చు. ఆసక్తి గల వారు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్లు, రిటైలర్లను సంప్రదించి తమ ఆధార్ కార్డు ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉండటంతో, సిమ్ మార్చుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story