- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Blinkit: ఆర్డర్ తర్వాత కూడా మరిన్ని వస్తువులు ఎంచుకునే సరికొత్త ఫీచర్ తెచ్చిన బ్లింక్ఇట్
ముఖ్యంగా చివరి నిమిషంలో కొత్త వాటిని ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ క్విక్ కామర్స్ మార్కెట్లో పోటీ విపరీతంగా పెరుగుతోంది. తాజాగా ఇందులో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింక్ఇట్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా కస్టమర్లు ఆర్డర్ చేసిన తర్వాత కూడా మరిన్ని వస్తువులను కార్ట్‌లో చేర్చేందుకు వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా చివరి నిమిషంలో కొత్త వాటిని ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసం ఎటువంటి అదనపు డెలివరీ ఛార్జీలు వసూలు చేయడం లేదని, రెండవ ఆర్డర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదని కంపెనీ అధికారిక ప్రకటనలో వివరించింది. ఈ ఫీచర్‌తో పాటు దాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి అభిప్రాయాలు చెప్పవచ్చని బ్లింక్ఇట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా చెప్పారు. బ్లింక్ఇట్‌తో పాటు ఇతర క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు సైతం కొత్త కొత్త ఫీచర్లను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. జెప్టో రెండు భిన్నమైన ఫీచర్లను పరీక్షిస్తోని. అందులో అధిక విలువైన, ప్రీమియం ఉత్పత్తుల కోసం 'సూపర్ మాల్ ' పేరుతో, ఫార్మా విభాగంలో డయాగ్నస్టిక్ సేవల కోసం జెప్టో డయాగ్నస్టిక్స్ అనే మరో ఫీచర్‌ను తీసుకురానుంది. స్విగ్గీ సైతం బల్క్ ఆర్డర్ల కోసం 'మూఅక్స్‌సేవర్ ' అనే ఫీచర్ను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. అలాగే, దేశంలోని 122 రైల్వే స్టేషన్లకు కొత్త ఫుడ్ ఆన్ ట్రైన్ సేవలను ఇప్పటికే ప్రారంభించింది.






