BOBCARD offers: ప్రేమికుల కోసమే ఈ బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకునే ఛాన్స్

by Vennela |

BOBCARD offers: ప్రముఖ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా వాలెంటైన్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

BOBCARD offers: ప్రేమికుల కోసమే ఈ బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకునే ఛాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: BOBCARD offers: ప్రముఖ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా వాలెంటైన్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు తన కార్డులపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించిన బీఓబీ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం ద్వారా వాలెంటైన్స్ డేని ఉత్సాహంగా జరుపుకోవడంతోపాటు డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బీఓబీ కార్డు అనేక ఆఫర్లను తీసుకువచ్చింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పలు వస్తువుల కొనుగోలు, సేవల వినియోగంపై డిస్కౌంట్స్ ను అందజేసింది. అమెజాన్, మైంట్రా, ఫ్లిప్ కార్ట్, గోయిబిబో, జొమాటో, పీవీఆర్ ఐమాక్స్ ఇలా అనే వాటిపై డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ప్రేమికులందరూ ఉత్సాహంగా తక్కువ ఖర్చుతోనే సంబురాలు చేసుకోవచ్చు.

బ్లింకిట్:

బ్లింకిట్ లో వెయ్యి రూపాయల కంటే ఎక్కువ చేసిన ఆర్డర్లపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. కార్డుకు గరిష్టంగా రూ. 300 అందిస్తారు.బీవోబీసీసీ 300 అనే కోడ్ ను ఉపయోగించి ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు. ఫిబ్రవరి 8న ప్రారంభమైన ఈ ఆఫర్ ఈనెల 28వరకు ప్రతి శని, ఆదివారాల్లోనే అందుబాటులో ఉంటుంది.

ఫ్లిప్ కార్ట్ :

ఐఫోన్ 13, 15, 16 సిరీస్ లపై బీఓబీ కార్డు ద్వారా రూ. 5వేల వరకు తగ్గింపు పొందే ఛాన్స్ ఉంది. ఈ ఫోన్లను డబ్బులను ఒకేసారి చెల్లించి లేదా ఈఎంఐల రూపంలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరి 11 నుంచి 15 వరకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది.

అమెజాన్ :

బీఓబీ కార్డును ఉపయోగించి అమెజాన్ లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఈఎంఐ ద్వారా కొనుగోళ్లపై 7.5శాతం తక్షణ డిస్కౌంట్ తోపాటు 500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. నిబంధనల ప్రకారం పలు వస్తువులపై ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 1 నుంచి 23 వరకు చెల్లుబాటు అవుతుంది. అలాగే అమెజాన్ లో 2 వీలర్ ఈఎంఐపై రూ. 5000 వరకు తగ్గింపు లభిస్తోంది. కారుకు గరిష్టంగా రూ. 5వేల అందిస్తారు. ఫిబ్రవరి 28 వరకు వర్తిస్తుంది.

ఫ్లిప్ కార్డ్ గ్రోసరీ :

ఫ్లిప్ కార్ట్ లో రూ. 1500 కంటే ఎక్కువగా చేసిన ఆర్డర్లపై రూ.1 50డిస్కౌంట్ అందిస్తున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 14 వరకు తప్ప మిగిలిన శుక్రవారాల్లో లభిస్తుంది. 28వ తేదీ వరకు నిబంధనల మేర వర్తిస్తుంది.

గోఐబీబో :

విమానాలు, హోటల్స్ బుకింగ్ పై 15శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించారు. జీవోబీవోబీఈఎస్టీ అనే కోడ్ ను ఉపయోగించి దేశీయ విమానాలు, హోటళ్లపై అలాగే జీవోబీవోఐఎన్ టీఎఫ్ఈఎస్టీ అనే కోడ్ ద్వారా అంతర్జాతీయ విమానాలు, హోటల్స్ లో డిస్కౌంట్స్ లభిస్తాయి. ఇవి ఫిబ్రవరి 14వరకు చెల్లుబాటులో ఉంటాయి.

పీవీఆర్ ఐఎన్ వోఎక్స్ :

సినిమా టికెట్లు, ఆహార పదార్థాలపై 25శాతం వరకు డిస్కౌంట్ పొందే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆ ఆఫర్ అందుబాటులోనే ఉంటుంది.

Next Story