- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Zomato:జొమాటో కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఇక నుంచి ఆ పేరు మాయం!

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ(food delivery company) జొమాటో(Zomato) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న స్టార్టప్‌గా ప్రారంభమై.. అంచెలంచెలుగా విస్తరించింది. ఇక ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన కొద్ది నిమిషాల్లోనే ఫుడ్(Food) తీసుకొస్తుంది. ఇప్పుడు నిత్యం వేలు, లక్షల్లో ఆర్డర్స్ డెలివరీ చేస్తోంది. అంతేకాదు ఈ కంపెనీ బ్లింకిట్‌ను కూడా ప్రారంభించింది.
ఇదిలా ఉంటే.. తాజాగా జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్(Online) ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పేరు మార్చుకుంది. ఇక నుంచి ‘జొమాటో లిమిటెడ్’కు బదులు ‘Eternal Limited’ పేరు కొనసాగుతుందని ప్రకటించింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని, షేర్ హోల్డర్లు ఈ పేరును ఆమోదించాల్సి ఉందని పేర్కొంది.
ఈ క్రమంలో జొమాటో గ్రూప్ CEO & సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ BSEకి దాఖలు చేసిన లేఖలో.. మేము బ్లింకిట్‌ను కొనుగోలు చేసినప్పుడు కంపెనీ, బ్రాండ్/యాప్ మధ్య తేడాను గుర్తించడానికి అంతర్గతంగా “ఎటర్నల్”(Eternal) ఉపయోగించడం ప్రారంభించామని పేర్కొన్నారు. జొమాటో(Zomato)కు కంటే ఏదైనా వ్యాపారం మా భవిష్యత్తుకు ముఖ్యమైనదిగా మారిన రోజు మేము కంపెనీ పేరును ఎటర్నల్‌గా మార్చాలని అనుకున్నాము. ఈరోజు బ్లింకిట్(Blinkit)తో మేము అనుకున్న స్థాయికి చేరుకున్నామని భావిస్తున్నాము. అందుకే కంపెనీ పేరును ‘ఎటర్నల్ లిమిటెడ్’గా మార్చడానికి నిర్ణయించామని పేర్కొన్నారు.