- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Banks: స్కామ్ అకౌంట్లను గుర్తించడానికి బ్యాంకుల్లో ఏఐ ఆధారిత వ్యవస్థ
ఆర్‌బీఐ ఓ బ్యాంకులో ఏఐ- ఆధారిత వ్యవస్థను ఉపయోగించి పైలట్ కార్యక్రమాన్ని చేపట్టింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ మోసాలు, మనీలాండరింగ్‌ను అరికట్టడానికి అన్ని బ్యాంకులలో ఖాతాలలో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ధృవీకరణను తప్పనిసరి చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నిర్ణయించింది. ఈ మేరకు ఆర్‌బీఐ త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొదట స్కామ్ ఖాతాలను గుర్తించి వాటిని బ్లాక్ చేయడానికి ఆర్‌బీఐ ఓ బ్యాంకులో ఏఐ- ఆధారిత వ్యవస్థను ఉపయోగించి పైలట్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సమయంలో సదరు ప్రభుత్వ రంగ బ్యాంకులో మాత్రమే 13 లక్షల ఖాతాలను గుర్తించి బ్లాక్ చేశారు. మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాత, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులు మ్యూల్ ఖాతాలను గుర్తించి బ్లాక్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఏ రకమైన అక్రమ బదిలీనైనా అరికట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సైబర్ మోసగాళ్లు సామాన్యులను లక్ష్యంగా చేసుకోకుండా ఉండటానికి ఈ వ్యవస్థ ఎలాంటి టూ-వే లావాదేవీనైనా గుర్తించగలదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా బ్యాంకింగ్ లైసెన్స్‌లు, వాటి పునరుద్ధరణ దీని పరిధిలోకి వస్తాయని తెలుస్తోంది. ఈ నిబంధనలను పాటించేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా భారీ ప్రచారాన్ని కూడా నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం.






