- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bankbazaar: డిజిటల్ గోల్డ్ లోన్ విభాగంలోకి అడుగుపెట్టిన బ్యాంక్‌బజార్
ఫిజిటల్ మోడల్ విధానంలో జరిగే ఈ గోల్డ్ లోన్‌ల ప్రక్రియ కోసం ఇరు సంస్థలు సమాన బాధ్యతలను చేపట్టనున్నాయి

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ బ్యాంక్‌బజార్ రుణ విభాగంలోకి అడుగుపెట్టింది. దీనికోసం డిజిటల్ గోల్డ్ లోన్లు ఇచ్చేందుకు ముత్తూట్ ఫిన్‌కార్ప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈక్విటీ ఇన్వెస్టర్‌గా బ్యాంక్ బజార్‌లో ముత్తూట్ ఫిన్‌కార్ప్ రూ. 15 కోట్ల పెట్టుబడి పెట్టింది. ముత్తూట్ ఫిన్‌కార్ప్‌కు ఉన్న విస్తారమైన మౌలిక సదుపాయాలను ఉపయోగించి బ్యాంక్‌బజార్ డిజిటల్ గోల్డ్ లోన్లు ఇవ్వనుంది. ముఖ్యంగా బ్యాంక్‌బజార్‌కు చెందిన డిజిటల్ సామర్థ్యాలను ఉపయోగించడం ద్వారా తక్కువ సమయంలో సురక్షితమైన బంగారు రుణాలను ఇవ్వడమే తమ భాగస్వామ్యం లక్ష్యమని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. ఫిజిటల్ (ఫిజికల్ + డిజిటల్) మోడల్ విధానంలో జరిగే ఈ గోల్డ్ లోన్‌ల ప్రక్రియ కోసం ఇరు సంస్థలు సమాన బాధ్యతలను చేపట్టనున్నాయి. బ్యాంక్‌బజార్ డిజిటల్ ఆన్‌బోర్డింగ్, మార్కెటింగ్, కస్టమర్ ఎంగేజ్‌మెంట్ వంటి కార్యకలాపాలను చూసుకోనుంది. ఇదే సమయంలో కేవైసీ, వాల్యూయేషన్, పంపిణీ, బంగారం నిల్వ వంటి బాధ్యతలను ముత్తూట్ ఫిన్‌కార్ప్ నిర్వహిస్తుంది. ఇరు సంస్థల భాగస్వామ్యం కారణంగా దేశీయంగా అస్థిర గోల్డ్ లోన్ మార్కెట్లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఇప్పటికీ 65 శాతం బంగారు రుణాలు నియంత్రణ పరిధిలో లేని సంస్థల ద్వారానే జరుగుతున్నాయి.






