- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bajaj Group: అలియాంజ్ నుంచి 23 శాతం వాటా కొనుగోలు చేసిన బజాజ్ గ్రూప్
ఈ ఒప్పందం కారణంగా బజాజ్ సంస్థకు అలియాంజ్ కంపెనీతో ఉన్న 24 ఏళ్ల భాగస్వామ్యం ముగిసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజం బజాజ్ గ్రూప్, తన బీమా సంస్థల బజాజ్-అలియాంజ్లోని 23 శాతం వాటాను అలియాంజ్ ఎస్ఈ నుంచి కొనుగోలు చేసినట్టు గురువారం వెల్లడించింది. దీనికోసం 2.38 బిలియన్ డాలర్లు(రూ. 21.4 వేల కోట్లు) చెల్లించినట్టు గ్రూప్ సంస్థ బజాజ్ ఫిన్‌సర్వ్ తెలిపింది. ఈ ఒప్పందం కారణంగా బజాజ్ సంస్థకు అలియాంజ్ కంపెనీతో ఉన్న 24 ఏళ్ల భాగస్వామ్యం ముగిసింది. ఫలితంగా బజాజ్ అలియాంజ్ బీమా వ్యాపారం పూర్తిగా బజాజ్ గ్రూప్ అధీనంలోకి వెళ్లనుంది. బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లలో అలియాంజ్ కంపెనీకి చెందిన వాటాను గ్రూప్ సంస్థ బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, జమన్‌లాల్ సన్స్ సంయుక్తంగా కొనుగోలు చేశాయని బజాజ్ ఫిన్‌సర్వ్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. జనరల్ ఇన్సూరెన్స్‌లో ఉన్న వాటా కోసం రూ. 12.19 వేల కోట్లు, లైఫ్ ఇన్సూరెన్స్‌లోని వాటా రూ. 9,200 కోట్లను చెల్లించినట్టు కంపెనీ వివరణ ఇచ్చింది. దీంతో రెండు కంపెనీల్లోనూ బజాజ్ సంస్థ వాటా 97 శాతానికి పెరిగింది. ఈ కొనుగోలు ద్వారా బీమా రంగంలో మరింత విస్తరణకు, కొత్త పాలసీలను తెచ్చేందుకు వీలవుతుందని బజాజ్ ఫిన్‌సర్వ్ ఎండీ, ఛైర్మన్ సంజీవ్ బజాజ్ వెల్లడించారు.






