- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోటక్ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. ఇకపై ఆ సర్వీస్ పైనా ఛార్జీలు
కస్టమర్లకు కోటక్ మహింద్రా బ్యాంక్ బిగ్ షాక్ ఇచ్చింది. డిసెంబర్ 1 నుండి నెలకు 30 ఎస్‌ఎంఎస్‌ల కంటే ఎక్కువ ఎస్ఎంఎస్‌లు బ్యాంక్ నుండి వచ్చినట్లు అయితే ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. నెలకు 30 కంటే ఒకటి ఎక్కువ అయినా ఎస్ఎంఎస్‌కు 0.15 పైసలు వసూలు చేయనుంది.

దిశ, వెబ్ డెస్క్: కస్టమర్లకు కోటక్ మహింద్రా బ్యాంక్ బిగ్ షాక్ ఇచ్చింది. డిసెంబర్ 1 నుండి నెలకు 30 ఎస్‌ఎంఎస్‌ల కంటే ఎక్కువ ఎస్ఎంఎస్‌లు బ్యాంక్ నుండి వచ్చినట్లు అయితే ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. నెలకు 30 కంటే ఒకటి ఎక్కువ అయినా ఎస్ఎంఎస్‌కు 0.15 పైసలు వసూలు చేయనుంది. సాధారణంగా నెలకు 30 కంటే ఎక్కువ మెసేజ్‌లు వస్తుంటాయి. ఫోన్ పే నుండి ట్రాన్సాక్షన్ జరిగినా, బ్యాంక్ నుండి డబ్బు డ్రా చేసినా మెసేజ్ వస్తుంది. కాబట్టి 30 సందేశాలు అంటే చాలా తక్కువ.. కానీ దీనికి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి.
వాటిని పాటిస్తే ఎస్ఎంఎస్ ఛార్జీల మోత నుండి తప్పించుకోవచ్చు. ఒకవేళ మీది సేవింగ్స్ అకౌంట్ అయితే కంబైన్డ్ బ్యాలెన్స్ రూ.10వేలు దాటితే ఎస్ఎంఎస్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కంబైన్డ్ బ్యాలెన్స్ అంటే యావరేజ్ మంథ్లీ బ్యాలెన్స్, టర్మ్ డిపాజిట్ బ్యాలెన్స్ కలిపి రూ.10వేలు దాటాలి. అలా అయితే కట్టాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా మీది కోటక్ 811 అకౌంట్ అయితే కంబైన్డ్ బ్యాలెన్స్ ఖచ్చితంగా రూ.5వేలు మెయిన్‌టైన్ చేయాలి.
లేదంటే నెలకు 30 ఎస్ఎంఎస్‌లు దాటితే ఛార్జీలు వేస్తారు. ఒకవేళ మీది సాలరీ అకౌంట్ అయితే ప్రతినెల జీతం కోటక్ బ్యాంక్ అకౌంట్‌లో పడాలి. లేదంటే 30ఎస్ఎంఎస్‌లు దాటినట్టు అయితే ఛార్జీలు వేస్తారు. ఇప్పటి వరకు కోటక్ అన్‌లిమిటెడ్ మెసేజ్‌లను ఉచితంగా అందించింది. కాబట్టి ఎలాంటి ఛార్జీలు వేయలేదు. కానీ డిసెంబర్ నుండి ఈ రూల్స్ పాటించకపోతే కస్టమర్లకు ఛార్జీల మోత తప్పదు.






