- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Auto Sales: మేలో ఆటో అమ్మకాల జోరు
ప్యాసింజర్ విభాగంలో దిగ్గజ మారుతీ సుజుకి మే నెలలో మొత్తం 2,42,688 వాహనాలను విక్రయించి కంపెనీ చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డును నమోదు చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన రంగానికి సంబంధించి మే నెలలో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి. దేశీయ డిమాండ్ స్థిరంగా కొనసాగడం, ఎస్‌యూవీలు, ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలపై పెరిగిన ఆసక్తి ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్యాసింజర్ విభాగంలో దిగ్గజ మారుతీ సుజుకి మే నెలలో మొత్తం 2,42,688 వాహనాలను విక్రయించి కంపెనీ చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డును నమోదు చేసింది. ఇందులో దేశీయ విక్రయాలు 1,93,535 యూనిట్లు, ఎగుమతులు 41,914 యూనిట్లు ఉండగా, ఇతర ఓఈఎంలకు 7,239 యూనిట్లు సరఫరా చేసింది. ఇదే సమయంలో ఎంఅండ్ఎం మొత్తం 99,636 వాహనాలను విక్రయించి 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. యుటిలిటీ వాహనాల డిమాండ్, ట్రాక్టర్ల విభాగంలో బలమైన పనితీరు ఈ వృద్ధికి మద్దతు ఇచ్చాయి. మిగతా కంపెనీల్లో హ్యూండాయ్ మోటార్ దేశీయ విక్రయాల్లో 9.1 శాతం వృద్ధిని నమోదు చేయగా, మొత్తం విక్రయాలు 4.1 శాతం పెరిగాయి. టొయొటా కిర్లోస్కర్ అమ్మకాలు 7 శాతం పెరిగి 33,128 యూనిట్లకు చేరాయి. ఎస్‌యూవీ సెగ్మెంట్, హైబ్రిడ్ వాహనాలపై డిమాండ్ ఈ వృద్ధికి సహకరించింది. సరఫరా విభాగంలో కొన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, మొత్తం ఆటో మార్కెట్ స్థిరమైన డిమాండ్‌తో పాజిటివ్ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ప్రత్యేకంగా ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల విభాగాలు ఈ వృద్ధికి కీలకంగా నిలుస్తున్నాయి.






