Apple: భారత్‌లో యాపిల్ రికార్డు స్థాయి అమ్మకాలు

by S Gopi |

దేశీయ మార్కెట్లో తన స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ రిటైల్ స్టోర్ల సంఖ్యను పెంచుతోంది

Apple: భారత్‌లో యాపిల్ రికార్డు స్థాయి అమ్మకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో టెక్ దిగ్గజం యాపిల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో 9 బిలియన్ డాలర్ల(రూ. 79.44 వేల కోట్ల)కు చేరుకున్నాయి. మొత్తం అమ్మకాల్లో కంపెనీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐఫోన్‌ ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. దీని తర్వాత మ్యాక్‌బుక్ కంప్యూటర్‌లకు కూడా డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా దేశీయ మార్కెట్లో తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ రిటైల్ స్టోర్ల సంఖ్యను వేగంగా పెంచుతోంది. ఇదే సమయంలో స్థానిక ఉత్పత్తిని పెంచడం, విడిభాగాల విషయంలోనూ స్థానికంగా సోర్సింగ్ చేస్తుండటంతో డిమాండ్‌కు తగిన స్థాయిలో మార్కెట్లో ఐఫోన్‌ల లభ్యత అమ్మకాలు గణనీయంగా పెరిగేందుకు దోహదపడ్డాయి. యాపిల్ తయారీకి సంబంధించి భారత్‌కు కీలక కేంద్రంగా ఎంచుకుంటోంది. ప్రస్తుతం ప్రతి ఐదు ఐఫోన్‌లలో ఒకటి భారత్‌లోనే తయారవుతోంది. కంపెనీ చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి, మనదేశంలోనే ఐదు ప్లాంట్లలో ఉత్పత్తిని విస్తరించింది. ఈ పరిణామాలే యాపిల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగేందుకు మద్దతిచ్చాయి. రిటైల్ స్టోర్ల సంఖ్యను పెంచుతూనే, స్థానిక డిమాండ్ ఆధారంగా కంపెనీ భారత మార్కెట్లో మరింత వృద్ధిని సాధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story