- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPhone : ట్రంప్ అల్టిమేటంపై ఆపిల్ సీఈవో టామ్ కుక్ స్పందన
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రముఖ ఫోన్ల కంపెనీలకు అల్టిమేటం జారీ చేశాడు.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రముఖ ఫోన్ల కంపెనీలకు అల్టిమేటం జారీ చేశాడు. ఆపిల్(Apple), శాంసంగ్(Samsung) వంటి స్మార్ట్ ఫోన్ల తయారీదార్లు తమ ఫోన్లను అమెరికాలో తయారుచేయాలని లేదా 25% సుంకాన్ని(25% Tax) ఎదుర్కోవాలని ట్రంప్ హెచ్చరించాడు. అమెరికాలో విక్రయించే ఏ ఫోన్ తయారుదారుకైనా ఈ సుంకం వర్తిస్తుందని ఆయన తెలిపారు. భారతదేశంలో కొత్తగా నిర్మించబోయే ప్లాంట్లలో అమెరికాలో విక్రయించే ఐఫోన్స్ తయారు చేయాలనే ఆపిల్ సీఈవో టామ్ కుక్(CEO Tom Cook) ప్రణాళికలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆపిల్ కు భారత్, చైనాలే ఎందుకంటే..
ఆపిల్ విదేశాలలో లక్షలాది నైపుణ్యం కలిగిన ఇంజినీర్లకు తయారు చేయటానికి బిలియన్ డాలర్లను పెట్టుపడి పెట్టింది. భారీ జనాభా కలిగిన చైనా, భారత దేశంలో అమెరికాను కంటే ఎక్కువ నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు ఉన్నారు. వారికి చెల్లించటానికి ఆపిల్ చాలా తక్కువ ఖర్చు చేస్తుంది. అమెరికాలో పేలవమైన విద్యా వ్యవస్థ, అధిక వేతనాలు ఆపిల్ కు ఒక అడ్డంకిగా మారడంతో.. ప్రత్యామ్నాయంగా భారత్, చైనా వంటి దేశాలను ఎంపిక చేసుకుంది. ఒక వేళ అమెరికాలో ఐఫోన్ ఉత్పత్తి చేస్తే ఆపిల్ ప్రస్తుత ధర వెయ్యి డాలర్ల కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. ముడి సరుకు వంటి వాటిపై భారీగా ఖర్చు చేయాల్సి రావడం కూడా ఒక కారణం అని తెలుస్తోంది.
దీనిపై కుక్ స్పందిస్తూ.. "అమెరికాలో ఆపిల్ ఫోన్లను ఉత్పత్తి చేయాలనే భావనే ఒక అద్భుత కల. అయితే అది సాధ్యం కాదు." అని తేల్చేశాడు. ఇప్పుడు ఈయటర్ దేశాల్లో ఉన్న తమ కంపెనీలను అమెరికాకు తరలించటానికి 5 నుండి 10 ఏళ్ళు పట్టవచ్చు." అని కూడా అన్నారు. ట్రంప్ హెచ్చరికల తరువాత, ఈ త్రైమాసికంలో ఆపిల్ 900 మిలియన్ల డాలర్ల వరకు సుంకాన్ని ఎదుర్కుంటుందని భావిస్తున్నట్లు కుక్ తెలిపారు.
వినియోగదారులపై తీవ్ర ప్రభావం
ఆపిల్ పై 25% సుంకం విధించటం వలన అమెరికాలో ఐఫోన్ ధరలు పెరగవచ్చు అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతిమంగా దీని ప్రభావం కొనుగోలుదారులపై పడుతుందని అంచనా వేస్తున్నారు. ఐఫోన్ ఉత్పత్తి అమెరికాలో సాధ్యం కాకపోవచ్చు కాని ఆపిల్ ఈ ఏడాది అమెరికాలో తన కార్యకలాపాలు విస్తరించటానికి 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించింది. ఈ పెట్టుబడితో హుస్టన్ లోని సర్వర్లను ఉత్పత్తి చేయటానికి కొత్త సౌకర్యాలను సృస్టిస్తామని, అమెరికాలోని 20 స్టేట్స్ లో కార్పొరేట్ సౌకర్యాలను కల్పిస్తామని తెలిపింది.






