- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Apartment Price: 20 శాతం పెరిగిన అపార్ట్‌మెంట్ ధరలు
ఏడు ప్రధాన నగరాల్లో అపార్ట్‌మెంట్ ధరలు గత ఏడాదితో పోలిస్తే 8 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ల ధరలు పెరుగుతున్న ట్రెండ్ కొనసాగుతోంది. తాజా డేటా ప్రకారం, 2026 మొదటి త్రైమాసికంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై, కోల్‌కతా వంటి ఏడు ప్రధాన నగరాల్లో అపార్ట్‌మెంట్ ధరలు గత ఏడాదితో పోలిస్తే 8 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగాయి. ముఖ్యంగా నిర్మాణ వ్యయాలు, భూమి ధరలు, అలాగే ప్రీమియం హౌసింగ్ వైపు కొనుగోలుదారుల మొగ్గు చూపడం వంటి కారణాలతో ధరలు ఈ స్థాయిలో పెరిగాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో 70,631 అపార్ట్‌మెంట్లు విక్రయమయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 8 శాతం ఎక్కువ. ఇదే సమయంలో, కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఫ్లాట్‌ల సరఫరా 13 శాతం పెరిగి 90,023 యూనిట్లకు చేరాయి. అయితే, బడ్జెట్ ధరల ఫ్లాట్‌లకు గిరాకీ తగ్గిపోతోందని నివేదిక పేర్కొంది. రూ. 50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు 24 శాతం తగ్గగా, రూ. 1 కోటి పైబడిన ప్రీమియం అపార్ట్‌మెంట్ల అమ్మకాలు 30 శాతం పెరిగాయి. అంటే, కొనుగోలుదారులు ఇప్పుడు ఎక్కువగా ప్రీమియం మరియు బ్రాండెడ్ ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపుతున్నారని నివేదిక వెల్లడించింది.






