- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆంథ్రోపిక్ ‘క్లాడ్ కోడ్’ లీక్.. బయటపడిన రహస్య ఫీచర్లు!
ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదిపేసిన ఏఐ దిగ్గజం ‘ఆంథ్రోపిక్’కు భారీ షాక్ తగిలింది. అత్యంత రహస్యమైన ‘క్లాడ్ కోడ్’ (Claude Code) సోర్స్ కోడ్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామిగా ఉన్న ఆంథ్రోపిక్ (Anthropic) సంస్థకు భారీ షాక్ తగిలింది. ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్ల నుంచి ట్రిలియన్ల డాలర్లను తుడిచిపెట్టేంత శక్తివంతమైన ఏఐ టూల్స్‌ను రూపొందించిన ఈ సంస్థ, ఇప్పుడు తన అత్యంత కీలకమైన 5 లక్షల లైన్ల ‘క్లాడ్ కోడ్’ (Claude Code) సోర్స్ కోడ్ పొరపాటున ఇంటర్నెట్‌లో లీక్ అయింది. ఇవాళ జరిగిన ఈ ఘటన ఏఐ టెక్నాలజీలో కలకలం రేపుతోంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసే క్రమంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల సుమారు 2,200 ఫైళ్లు, 30 ఎంబీ పరిమాణం ఉన్న కీలకమైన కోడ్ బహిర్గతమైంది. కేవలం కొన్ని గంటల్లోనే ఈ కోడ్‌ను వేల సంఖ్యలో డెవలపర్లు కాపీ చేసుకున్నారు. దీంతో కంపెనీకి చెందిన రహస్య ఆల్గారిథమ్స్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. అయితే మానవ తప్పిదం కారణంగా ఈ లీకేజీ జరిగినట్లుగా కంపెనీ వెల్లడించింది.
కోడ్‌లో బయటపడ్డ ఆసక్తికర అంశాలు..
ఈ లీక్ అయిన డేటా ద్వారా ఆంథ్రోపిక్ రూపొందిస్తున్న కొన్ని వింతైన, భయంకరమైన ఫీచర్లు వెలుగులోకి వచ్చాయి. యూజర్ ప్రమేయం లేకుండా నిరంతరం బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసే శక్తివంతమైన ఏఐ ఏజెంట్ కైరోస్ అని తేలింది. కోడింగ్ చేసే డెవలపర్ల కోసం 18 రకాల ఏఐ పెంపుడు జంతువులతో (Digital Pets) కూడిన సరికొత్త సిస్టమ్ ఇది. ఏఐ రాసిన కోడ్‌ను, మనుషులు రాసినట్లుగా భ్రమ కలిగించేలా మార్చే రహస్య ఫీచర్ అండర్ కవర్ మోడ్‌ను గుర్తించారు.
మార్కెట్లను కుదిపేసిన లీక్..
340 బిలియన్ డాలర్ల విలువైన ఆంత్రోపిక్ సంస్థ, ఈ ఏడాది ప్రారంభంలో లీక్ చేసిన ఏఐ టూల్స్ వల్ల ప్రపంచ ఐటీ రంగం కుప్పకూలింది. ముఖ్యంగా TCS, Infosys, Wipro వంటి సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీల భవిష్యత్తుపై ఆందోళనలు పెరగడంతో, మార్కెట్ నుంచి రూ.లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. కేవలం ఒక్క లీక్ ప్రకటనతో సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్న దిగ్గజ కంపెనీల షేర్లు కుప్పకూలి సుమారు 14.5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఈ లీక్‌ను అరికట్టడానికి ఆంథ్రోపిక్ లీగల్ టీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది, కానీ అప్పటికే కోడ్ ఇంటర్నెట్‌లో దావనంలా వ్యాపించింది.






