Reliance: ప్రపంచ టాప్-25 కంపెనీల జాబితాలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్

by S Gopi |

రిలయన్స్ సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానంలో ఉంది.

Reliance: ప్రపంచ టాప్-25 కంపెనీల జాబితాలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేక సవాళ్ల మధ్య కూడా రాణించింది. తాజాగా భారత అతిపెద్ద వ్యాపార గ్రూప్, నికర విలువ ప్రకారం ప్రపంచంలోనే 25వ అత్యంత విలువైన కంపెనీల జాబితాలో స్థానం సంపాదించింది. దీంతో మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, సౌదీ అరామ్‌కో వంటి దిగ్గజాల సరసన చేరింది. బ్లూమ్‌బర్గ్ గణాంకాల ప్రకారం, రిలయన్స్ సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానంలో ఉంది. కంపెనీ నికర విలువ 118 బిలియన్ డాలర్ల(రూ. 10.07 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఇది కంపెనీ ఆస్తులను లెక్కించి, అందులో నుంచి కంపెనీ చెల్లించాల్సిన మొత్తాన్ని తీసివేయగా వచ్చే మొత్తం. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో కంపెనీ సుమారు 140 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ విలువ ఇప్పుడు 19 నిఫ్టీ50 కంపెనీలు, 25 ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల ఉమ్మడి విలువకు సమానం. మరోవైపు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి సంస్థలో కీలక బాధ్యతలు అప్పగించారు. మే 1 నుంచి అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకుంటారని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఆయనను ఐదేళ్ల కాలానికి నియమించారు. హెచ్ఆర్, నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సుల మేరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆదివారం జరిగిన సమావేశంలో ఈ నియామకాన్ని ఆమోదించారు.

Next Story