- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amul: భారత దిగ్గజ ఫుడ్ బ్రాండ్‌గా అమూల్
జాబితాలో బ్రిటానియా మూడో స్థానంలోనూ, కర్ణాటకకు చెందిన పాల సహకార సంస్థ నందిని నాలుగో స్థానంలో, డాబర్ ఐదో స్థానంలో ఉన్నాయి

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్)కు చెందిన అమూల్ భారత్‌లోని ఫుడ్ బ్రాండ్ విభాగంలో ఈ ఏడాది మరోసారి అగ్రస్థానాన్ని సాధించింది. బ్రాండ్ ఫైనాన్స్ 2025 ఏడాదికి సంబంధించి విడుదల చేసిన నివేదిక ప్రకారం, అమూల్ బ్రాండ్ విలువ రూ. 4.1 బిలియన్ డాలర్ల(రూ. 35 వేల కోట్లకు పైనే)తో టాప్ పొజిషన్‌లో కొనసాగుతుండగా, 1.15 బిలియన్ డాలర్ల(రూ. 9,831 కోట్ల)తో ఢిల్లీకి చెందిన మదర్ డెయిరీ రెండో స్థానంలో ఉంది. ఇదే జాబితాలో బ్రిటానియా మూడో స్థానంలోనూ, కర్ణాటకకు చెందిన పాల సహకార సంస్థ నందిని నాలుగో స్థానంలో, డాబర్ ఐదో స్థానంలో ఉన్నాయి. ఫుడ్ విభాగం కాకుండా మొత్తం భారత్‌లోని టాప్-100 బ్రాండ్లలో అమూల్ 17వ స్థానంలో ఉండగా, మదర్ డెయిరీ 35వ స్థానంలో ఉంది. మదర్ డెయిరీ గతేడాది జాబితాలో 41వ స్థానంలో నిలిచింది. అమూల్ మాతృసంస్థ జీసీఎంఎంఎఫ్ 36 లక్షల మంది రైతుల నుంచి పాలను సేకరిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద పాల సహకార సంస్థగా ఉంది. ఈ బ్రాండ్ 50కి పైగా దేశాల్లో అమూల్ పాలను, పాల ఉత్పత్తులను విక్రయిస్తుంది. ప్రతిరోజూ 3.2 కోట్ల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరిస్తుంది. ఏటా పాలు, వెన్న, జున్ను, నెయ్యి, ఐస్‌క్రీమ్ లాంటి 2.4 కోట్లకు పైగా అమూల్ ఉత్పత్తులను మార్కెట్లోకి సరఫరా చేస్తోంది.






