Amitabh Bachchan: ఫ్లాట్ అమ్మేశాడు.. కోట్లు సంపాదించాడు.. బిగ్‌ బి డూప్లెక్స్‌ సేల్‌ డీటెయిల్స్‌ ఇవే!

by Vennela |

Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఓ వైపు సినిమాలు చేస్తూనే వ్యాపారంలోనూ రాణిస్తున్నారు.

Amitabh Bachchan: ఫ్లాట్ అమ్మేశాడు.. కోట్లు సంపాదించాడు.. బిగ్‌ బి డూప్లెక్స్‌ సేల్‌ డీటెయిల్స్‌ ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఓ వైపు సినిమాలు చేస్తూనే వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. తాజాగా ముంబైలోనూ తనదైన స్ట్రాటజీతో లాభాలను అందుకుంటున్నారు. ముంబైలోని తన డూప్లెక్స్ అపార్ట్ మెంట్(Duplex apartment) ను భారీ మొత్తానికి విక్రయించి కోట్లలో లాభాలను అందుకున్నారు. ఇప్పుడు బిగ్ బీ డూప్లెక్స్ ఫ్లాట్ (Big B Duplex Flat)విక్రయం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. తక్కువ ధరకు కొనుగోలు చేసి భారీ మొత్తంలో లాభాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ఫ్లాట్ ఎప్పుడు కొన్నారు?..ఇప్పుడెంతకు విక్రయించారు?. ఎంత లాభం వచ్చింది?. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ముంబై ఓషివారా(Oshiwara) ప్రాంతంలోని తన డూప్లెక్స్ అపార్ట్ మెంటును రూ. 83కోట్లకు అమితాబ్ బచ్చన్ విక్రయించినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ స్క్వేర్ యార్డ్స్(Consultant Square Yards) ఓ ప్రకటనలో తెలిపింది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను పరిశీలించినట్లు తెలిపింది. ఈ డూప్లెక్స్ కు సంబంధించిన ట్రాన్సక్షన్ జనవరి 2025లోనే జరిగినట్లు తెలిపింది. ఈ ప్రీమియం డూప్లెక్స్ అపార్ట్ మెంట్ మొత్తం 5,704చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. అందులో కార్పెట్ ఏరియా 5185.62 చదరపు అడుగులుగా ఉంటుంది. అలాగే టెర్రస్ 4,800 చదరపు అడుగుల్లో విశాలంగా ఉంటుంది. 6 కార్లు పార్క్ చేసుకునేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం కూడా ఉంటుంది. ఈ ప్రాపర్టీ ముంబైలోని ఓషివారా ప్రాంతంలో క్రిస్టల్ గ్రూప్ నకు చెందిన అట్లాంటిస్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో ఉంది.

ముంబైలోని ఈ డూప్లెక్స్ అపార్ట్ మెంట్ ను అమితాబ్ బచ్చన్ 2021లో రూ. 31కోట్లకు కొనుగోలు చేసినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్ స్క్వేర్ యార్డ్స్(Consultant Square Yards) తెలిపింది. ఇప్పుడు దాన్ని రూ. 83 కోట్లకు విక్రయించారు. దాదాపు 4ఏళ్ల తర్వాత విక్రయించి ఏకంగా రూ. 52 కోట్లు మేర లాభం అందుకున్నట్లు సమాచారం. ఇది కొనుగోలు ధరతో పోలిస్తే 168శాతం అధికమని చెప్పవచ్చు. అపార్ట్ మెంట్ ని ఓ హీరోయిన్ కు అద్దెకు ఇచ్చి కూడా భారీగానే రెంటు పొందినట్లు సమాచారం. ఈ అపార్ట్ మెంట్ ట్రాన్సాక్షన్స్ లో స్టాంప్ డ్యూటీ కింద రూ. 4.98కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ. 30వేలు ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story