- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amazon: రోజుకు 2 కొత్త డార్క్ స్టోర్లను ప్రారంభిస్తానన్న అమెజాన్
ప్రధానంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో మరింత వేగంగా సేవలందించాలని చూస్తున్నట్టు తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన క్విక్ కామర్స్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించింది. కంపెనీ తన 'అమెజాన్ నౌ' కోసం ఇకపై ప్రతిరోజూ 2 కొత్త డార్క్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు, ఈ ఏడాది ఆఖరు నాటికి 300కి వాటిని పెంచాలని భావిస్తున్నట్టు సోమవారం ప్రకటనలో వెల్లడించింది. ప్రధానంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో మరింత వేగంగా సేవలందించాలని చూస్తున్నట్టు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్, బ్లింక్ఇట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లతో మరింత పోటీ పడేందుకు ఇది దోహదపడుతుందని అమెజాన్ భావిస్తోంది. కస్టమర్ల నుంచి అమెజాన్ నౌకు ఎక్కువ ఆదరణ లభిస్తుండటం సంతోషంగా ఉంది. విస్తరణ ద్వారా ఇంకా వేగంగా వినియోగదారులకు సేవలందించాలనుకుంటున్నాం. ఈ ఏడాది పూర్తయ్యేలోపు 300 కంటే ఎక్కువ మైక్రో-ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు ఉండాలి. బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రోజుకు 2 డార్క్ స్టోర్లను ప్రారంభిస్తామని అమెజాన్ ఇండియా, కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెజాన్ నౌ దాదాపు 250 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను నిర్వహిస్తున్నది. ప్రస్తుతం అమెజాన్ నౌ నిమిషాల్లో నిత్యావసరాలను, పూర్తి కిరాణా సామగ్రి అందిస్తామని, గంటల్లో అదనంగా 40,000 వస్తువులను, అదే రోజు 10 లక్షల కంటే ఎక్కువ వస్తువులను, ఆర్డర్ చేసిన మరుసటి రోజుకు మరో 40 లక్షల వస్తువులను డెలివరీ చేస్తామని హామీ ఇచ్చింది.






