- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆల్ టైం రికార్డు.. ఒక్కరోజే అన్ని వేలు పెరిగి భారీగా షాక్ ఇచ్చిన బంగారం ధరలు..
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే నిన్నటి నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు బంగారం ధరలు సరికొత్త మైలు రాయి చేరాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,150 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.2750 పెరిగి రూ.92,900 ఉంది. అలాగే నిన్న రూ.98,350 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరల పై ఈ రోజు రూ.3000 పెరిగి రూ.1,01,350 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు పెరిగి కిలో రూ. 1,11,000గా ఉంది. కాగా అంతర్జాతీయ ఒడిదుడుకులతో బంగారంపై పెట్టుబడికి డిమాండ్, స్థానిక వివాహాల సీజన్ ఈ ధరలు భగ్గుమనడానికి ప్రధాన కారణాలు అనే చెప్పవచ్చు.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.92,900
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,350
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.92,900
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,350






