Airtel: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా ఎయిర్‌టెల్

by S Gopi |

అంతర్జాతీయంగా కంపెనీ 65 కోట్ల సబ్‌స్క్రైబర్లతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా నిలిచింది.

Airtel: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా ఎయిర్‌టెల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రైవేట్ రంగ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయంగా కంపెనీ 65 కోట్ల సబ్‌స్క్రైబర్లతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా నిలిచింది. ఎయిర్‌టెల్ దేశీయంగా 36.8 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. దేశంలో 5జీ ప్లస్ సేవలను ప్రారంభించిన మొదటి టెలికాం కంపెనీ కూడా. ప్రస్తుతం 1.3 కోట్లకు పైగా ఇళ్లకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌, డిజిటల్ టీవీ ద్వారా మరో 15 కోట్ల కుటుంబాలకు సేవలందిస్తోంది. చేరువవుతోంది. ఎంటర్‌ప్రైజ్ విభాగమైన ఎయిర్‌టెల్ బిజినెస్ 4,00,000 రూట్ కిలోమీటర్లకు పైగా సముద్రగర్భ ఫైబర్, గ్రీన్ డేటా సెంటర్ల మద్దతుతో సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్, ఐఓటీ, ఎస్డీ-వాన్ వంటి అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా 65 కోట్ల మైలురాయి చేరడంతో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించాల్సిన బాధ్యత పెరిగిందని ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మన్ గోపాల్ విట్టల్ అన్నారు.

Next Story