వచ్చే మార్చి నాటికి లక్ష గ్రామాల్లో 5జీ సేవలు: Airtel

by Disha Web Desk 17 |
వచ్చే మార్చి నాటికి లక్ష గ్రామాల్లో 5జీ సేవలు: Airtel
X

ముంబై: డిస్ట్రిబ్యూషన్ సమస్యలను పరిష్కరించేందుకు డైరెక్ట్-టూ-కన్స్యూమర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు టెలికాం కంపెనీలతో భాగస్వామ్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ అభిప్రాయపడ్డారు. అందుకోసం ఎయిర్‌టెల్ సహాయం చేస్తుందన్నారు. బుధవారం ముంబైలో ప్రారంభమైన పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఫ్రేమ్స్-2023 కార్యక్రమలో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం వివిధ కంటెంట్ డెలివరీ విభాగాలైన కేబుల్, డీటీహెచ్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు వేర్వేరు నియంత్రణలు ఉన్నాయి. దానివల్ల డిస్ట్రిబ్యూషన్ సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పనిచేసే వ్యాపార నమూనాను మార్చాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.




ఎయిర్‌టెల్‌కు కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లను సొంతం చేసుకోవడం, కొనుగోలు చేయడం ఇష్టం లేదని, అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారులకు మరింత చేరువ అయ్యేందుకు సాయపడగలదన్నారు. ఇదే సమావేశంలో, 5జీ నెట్‌వర్క్ గురించి స్పందించిన గోపాల్ విట్టల్, ఎయిర్‌టెల్ ఇప్పటికే 3,500 పట్టణాలకు తన 5జీ సేవలను విస్తరించింది. 2024, మార్చి నాటికి 7 వేల పట్టణాలు, దాదాపు లక్షల గ్రామాలకు ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. 5జీ సేవలు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా డేటా వినియోగం గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు.



Next Story

Most Viewed