- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air India: AI సేవలు మరింతగా.. ఫ్లైట్ జర్నీ చేసేవారికి గుడ్ న్యూస్.. ఈజీ టికెట్ బుకింగ్ ఇలా
Air India: ఎయిర్ ఇండియా సరికొత్త ఏఐ ఫీచర్ eZ బుకింగ్ ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ తో టెక్ట్స్ లేదా వాయిస్ కమాండ్స్ తో విమాన టికెట్స్ ను మరింత సులభంగా బుక్ చేసుకోవచ్చు.

దిశ, వెబ్ డెస్క్: Air India: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులను తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఏఐ(AI) కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా(Air India) కూడా సరికొత్త ఏఐ ఫీచర్(AI feature) ను ప్రవేశపెట్టింది. అదే eZ బుకింగ్. ఈ ఫీచర్ తో టెక్ట్స్ లేదా వాయిస్ కమాండ్స్(Text or voice commands) తో విమాన టికెట్లను మరింత సులభంగా బుక్ చేసుకోవచ్చు. మరి ఈ ఏఐ ఫీచర్ ఎలా పనిచేస్తుంది దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
ప్రస్తుతానికి లేటెస్ట్ ఈజీ బుకింగ్ ఫీచర్(Easy booking feature) ఎయిర్ ఇండియా లాయల్టీ ప్రోగ్రామ్ అయిన మహారాజా క్లబ్ మెంబర్స్(Maharaja Club Members) కు మాత్రమే అందుబాటులో ఉంది. ప్యాసింజర్లు ఎయిరిండియా వెబ్ airindia.comలో దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. త్వరలోనే మొబైల్ వెబ్సైట్,యాప్ లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
eZబుకింగ్ అనేది ఏజెంటిక్ అనే అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Advanced Artificial Intelligence) తో పనిచేస్తుంది. ఇదొక ట్రావెల్ ఏజెంట్(Travel agent) మాట్లాడినట్లుగా ప్యాసింజర్లతో కమ్యూనికేట్ చేస్తుంది. ప్యాసింజర్లు ప్రయాణ వివరాలను సాధారణ భాషలో టైప్ చేయడం లేదా వాయిస్ కమాండ్ ద్వారా తెలియజేస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి ముంబై కి ఫస్ట్ ఫ్లైట్ బుక్ చెయ్..వచ్చేవారం చెన్నై-ముంబైకి రౌండ్ ట్రిప్ కోసం ఫ్లైట్ చూడు..ఈవిధంగా ఇంగ్లీష్ లో కమాండ్ ఇవ్వవచ్చు.
ఈ కమాండ్స్ తోనే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ మెషిన్ లెర్నింగ్(System Machine Learning) నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి టెక్నాలజీతో ప్యాసిజంర్ల రిక్వెస్ట్ అర్థం చేసుకుంటుంది. చాలా ఈజీగా స్పీడ్ గా టికెట్స్ బుక్ చేసుకునేలా చేస్తుంది.
ప్యాసింజర్లు ప్రయాణ వివరాలను సాధారణ భాసలో టైప్ చేసుకోవచ్చు. లేదంటే మాట్లాడుకోవచ్చు. వాయిస్ కమాండ్స్(Voice commands) కూడా విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ట్రావెల్ ప్లాన్స్ ను సులభంగా మార్చవచ్చు. ఏదైనా ట్రావెల్ ప్లాన్(Travel plan) ఒకే అనుకుంటే సురక్షితంగా చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ టికెట్ ను వెంటనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఎలా ఉపయోగించాలంటే?
1: ఎయిరిండియా వెబ్ సైట్లో మహారాజా క్లబ్ విభాగంలోకి లాగిన్ అవ్వాలి.
2. టాప్ మెనూలో ఉన్న eZ బుకింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. టెక్ట్స్ లేదా వాయిస్ తో ప్రయాణ వివరాలను అందించాలి. బుక్ ఏ ప్లైట్ టు హైదరాబాద్ నెక్ట్స్ వీక్
4. మీకు చూపించిన ట్రావెలింగ్ షెడ్యూల్ చెక్ చేసి..అవసరం అయితే మార్పులు చేసుకోవాలి. పేమెంట్ పూర్తి చేసి ఇ-టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.






