- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్ మెసేజెస్ ను AI చదువుతోంది! జాగ్రత్తా
ఇకపై వాట్సాప్ లో చాట్ చేసేముందు జాగ్రత్తగా ఉండండి.

దిశ, వెబ్ డెస్క్ : ఇకపై వాట్సాప్ లో చాట్ చేసేముందు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ వాట్సాప్ చాట్ ను ఏఐ చదివిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ X లో హల్ చల్ చేస్తోంది. వాట్సాప్ లో అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీని ఎనేబుల్ చేస్తే.. గ్రూపులో ఉన్న అన్ని మెసేజెస్ ను ఏఐ చదువుతోందని నెటిజన్స్ అంటున్నారు. ఈ వ్యవహారంపై పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ ట్వీట్ చేయడంతో మరింత దుమారం చెలరేగింది. "వాట్సప్ ఈరోజు నుంచి మీ మెసేజెస్ ను చదివే అవకాశం మెటా ఏఐకి కల్పిస్తోంది. దీని నుంచి జాగ్రత్తగా ఉండండి.
ప్రైవసీ సెట్టింగ్స్ లో ప్రైవసీ మోడ్ ను ఎల్లపుడూ ఆన్ లో ఉంచండి." అంటూ స్క్రీన్ షాట్లతో సహా విజయ్ పోస్టు చేసారు. అయితే ఈ రూమర్లపై వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది. మెటా ఏఐ అప్షనల్ అని, షేర్ చేసిన అంశాలను మాత్రమే చదువుతుందని తెలిపింది. మెటాకు మెసేజ్ చేసినపుడు, మెటాను చాట్స్ లో ట్యాగ్ చేసినపుడు మాత్రమే వాటిని చదవగలదని పేర్కొంది. వాట్సాప్ అడ్వాన్స్డ్ ప్రైవసీని ఆన్ చేస్తే కొన్ని ఏఐ ఫీచర్లను పొందలేరని, అయినా మెటాతో ఇంటరాక్ అవడం పూర్తిగా వారి వ్యక్తిగత అంశంగా స్పష్టం చేసింది.
అయితే ఈ వివాదంపై గ్రోక్ ను అడగగా..ఇదొక రూమర్ గా కొట్టిపడేసింది. మెసేజెస్ లో @MetaAI ని ట్యాగ్ చేసినవుడు మాత్రమే సంబంధింత మెసేజెస్ ను ఏఐ చదవగలదని చెబుతోంది.






