SBI: 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన ఎస్‌బీఐ

by S Gopi |

బ్యాంకు తొలిసారి 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కును దాటింది.

SBI: 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన ఎస్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవలి సెప్టెంబర్ త్రైమాసికంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు సాధించిన ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ కొత్త మైలురాయిని చేరుకుంది. గురువారం బ్యాంకు తొలిసారి 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కును దాటింది. మన కరెన్సీలో ఇది రూ. 8.86 లక్షల కోట్లకు సమానం. ఈ ఏడాది పండుగ సీజన్ సందర్భంగా రిటైల్ కొనుగోళ్లు పెరగడంతో మెరుగైన క్రెడిట్ వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో సెప్టెంబర్ నాటికి రూ. 44.20 లక్షల కోట్ల అడ్వాన్సులు, రూ. 55.92 లక్షల కోట్ల డిపాజిట్లతో కలిపి రూ. 100 లక్షల కోట్ల వ్యాపార మార్కును ఎస్‌బీఐ చేరుకుంది. మార్కెట్ క్యాప్ పరంగా దేశీయంగా 228 బిలియన్ డాలర్ల(రూ. 20.21 లక్షల కోట్ల)తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 170 బిలియన్ డాలర్ల(రూ. 15 లక్షల కోట్ల)తో రెండో స్థానంలో ఉన్నాయి. ఇక, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా మొదటి ఆరు అతిపెద్ద కంపెనీల్లో మూడు బ్యాంకులే ఉండటం గమనార్హం.

Next Story