Ad Guru: 'యాడ్ గురు ఆఫ్ ఇండియా' పీయూష్ పాండే కన్నుమూత

by S Gopi |

ఆయన మరణించిన విషయాన్ని ప్రముఖ యాడ్ కంపెనీ ఓగిల్వి ధృవీకరించింది.

Ad Guru: యాడ్ గురు ఆఫ్ ఇండియా పీయూష్ పాండే కన్నుమూత
X

దిశ, బిజినెస్ బ్యూరో: 'భారత ప్రకటనల గురువు'గా దేశ యాడ్ రంగంలో పేరున్న పీయూష్ పాండే శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని, నెల రోజుల నుంచి కోమాలో ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. నాలుగు దశాబ్దాలకు పైగా తన కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయమైన, ఐకానిక్ ప్రకటనలను పీయూష్ పాండే అందించారు. ఆయన మరణించిన విషయాన్ని ప్రముఖ యాడ్ కంపెనీ ఓగిల్వి ధృవీకరించింది. పీయూష్ పాండే ఓగిల్వి కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. 1984లో ఓగిల్వి ద్వారా కమర్షియల్ యాడ్స్ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన క్యాడ్‌బరీ, ఫెవికాల్, డెయిరీ మిల్క్ లాంటి బ్రాండ్లకు పీయూష్ పాండే యాడ్స్ రూపొందించారు. ముఖ్యంగా గ్లోబల్ బ్రాండ్ల ఆధిపత్యాన్ని దాటి మరీ భారతీయ సంస్కృతి, భాషలకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో సంచలన యాడ్స్ అందించారు. ముఖ్యంగా క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్, ఫెవికాల్, టెలికాం బ్రాండ్ హచ్, ఏషియన్ పెయింట్స్ లాంటి ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు ఆయన చేసిన యాడ్స్ ఇప్పటికీ కోట్లాది మందికి నచ్చినవిగా ఉన్నాయి. 2016లో పీయూష్ పాండే భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందించింది. పీయూష్ పాండే మృతిపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలియజేశారు. దేశ యాడ్స్ రంగంలో ఆయన సంపాదించిన పేరు, అనేక తరాలకు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

Next Story