- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adit Palicha: వచ్చే ఏడాది జెప్టో ఐపీఓ: కో- ఫౌండర్ ఆదిత్ పాలిచా
దేశానికి చెందిన ప్రముఖ క్విక్ కామర్స్(Quick Commerce) దిగ్గజ సంస్థ జెప్టో(Zepto) స్టాక్ మార్కెట్లో(Stock Market) ఎంట్రీకి సన్నాహాలు మొదలు పెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశానికి చెందిన ప్రముఖ క్విక్ కామర్స్(Quick Commerce) దిగ్గజ సంస్థ జెప్టో(Zepto) స్టాక్ మార్కెట్లో(Stock Market) ఎంట్రీకి సన్నాహాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా 2025లో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ విషయాన్ని జెప్టో కో- ఫౌండర్(Co-Founder) ఆదిత్ పాలిచా(Adit Palicha) స్వయంగా వెల్లడించారు. 2025లో ఐపీఓ ద్వారా కంపెనీ ప్రైమరీ మార్కెట్లోకి రావచ్చని తెలిపారు. అలాగే.. 2026 నాటికి జెప్టో బ్రేక్ ఈవెన్(break even) సాధించి లాభాల్లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జెప్టో ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని, రోజుకు కొన్ని వేల వస్తువులను 10 నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేస్తున్నామని అన్నారు. అలాగే క్విక్ కామర్స్ సంస్థల వల్ల కిరాణా దుకాణాలు(Grocery stores) మూతపడే ప్రమాదముందన్న వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ ఆరోపణలు వాస్తవ డేటా ఆధారంగా లేవని పేర్కొన్నారు. ఇక కిరాణా దుకాణాల్లోని వస్తువుల ధరతో పోల్చుకుంటే జెప్టోలో తక్కువ ధరకే విక్రయిస్తున్నామని వెల్లడించారు.






