- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adani Group: రూ. 1.16 లక్షల కోట్లు పెరిగిన అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్
అదానీ గ్రూప్‌పై ఆరోపణలను సెబీ క్లియర్ చేయడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ పుంజుకుంది

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వ్యవహారంలో అదానీ గ్రూప్‌పై ఆరోపణలు నిరాధారమని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వేగంగా పుంజుకుంటోంది. గత వారాంతం ఒక్కరోజే రూ. 69,000 కోట్లకు పైగా పెరిగింది. అదానీ గ్రూప్‌పై ఆరోపణలను సెబీ క్లియర్ చేయడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ పుంజుకుంది. దీంతో సోమవారం ట్రేడింగ్‌లోనూ అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ. 1.16 లక్షల కోట్లు పెరిగింది. ఇది గతేడాది నవంబర్ 27 తర్వాత ఒక్కరోజులో వచ్చిన అత్యధిక లాభమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. గత రెండు సెషన్లలో కంపెనీ విలువ రూ. 1.8 లక్షల కోట్లు పెరిగి రూ. 15.44 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గడిచిన 10 నెలల్లోనే అత్యధికం. సోమవారం నాటి ర్యాలీలో అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్ అత్యధికంగా లాభపడ్డాయి. ఈ కంపెనీలు ఒక్కొక్కటి దాదాపు 20 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 12 శాతం పెరగగా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 7 శాతం పెరిగాయి.






