- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adani Group: ఇంజిన్ ఎంఆర్ఓ, పీ2ఎఫ్ మార్పు రంగంలోకి ప్రవేశించే యోచనలో అదానీ గ్రూప్
ఇంజిన్ ఎంఆర్ఓతో పాటు ప్యాసింజర్-ఎయిర్‌క్రాఫ్ట్-టు-ఫ్రైటర్ (పీ2ఎఫ్) కన్వర్షన్‌లోకి ప్రవేశించాలని..

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కొత్త విభాగంలోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే విమానాశ్రయ వ్యాపారంలో ఉన్న సంస్థ రానున్న రోజుల్లో విమాన ఇంజిన్ ఎంఆర్ఓతో పాటు ప్యాసింజర్-ఎయిర్‌క్రాఫ్ట్-టు-ఫ్రైటర్ (పీ2ఎఫ్) కన్వర్షన్‌లోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. పీ2ఎఫ్ కన్వర్షన్ అనేది కాలం తీరిన ప్యాసింజర్ విమానాలను కార్గో విమానాలుగా మార్చడం. అదానీ గ్రూప్ ఇప్పటికే విమానాశ్రయాలతో పాటు, విమానాలకు సంబంధించిన నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర పరిశీలన(ఎంఆర్ఓ), పైలట్ల శిక్షణ వ్యాపారంలో కూడా ఉంది. దీని సంబంధించి అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ డైరెక్టర్ జీత్ అదానీ మాట్లాడుతూ, అదానీ గ్రూప్ తన విమానయాన వ్యాపారాన్ని రెండు భాగాలుగా స్పష్టంగా విభజించిందని.. ఒకటి విమానాశ్రయ మౌలిక సదుపాయాల కోసం, మరొకటి పౌర, రక్షణ అవసరాలకు ఉపయోగపడే విమాన సంబంధిత సేవల కోసం అన్నారు. ఇప్పటికే విమాన నిర్వహణ, పైలట్ శిక్షణ, రక్షణ విమానయాన సేవలలో చురుగ్గా ఉంది. ల్యాండింగ్ గేర్ మరమ్మతులు, విమాన పెయింటింగ్, కార్గో-ప్లేన్ మార్పిడులు, భవిష్యత్తులో విమాన ఇంజిన్‌లను కూడా చేర్చడానికి అదానీ తన మరమ్మతు సేవలను విస్తరిస్తోంది. అహ్మదాబాద్, గౌహతి, భువనేశ్వర్ వంటి నగరాల్లో కొత్త ఎంఆర్ఓ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు జీత్ అదానీ పేర్కొన్నారు.






