Instagram: రీల్స్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇన్‌స్టా రీల్స్‌ కోసం స్పెషల్ యాప్!

by Yella Dhawani Reddy |

ప్రముఖ టెక్ సంస్థ మెటాకు (Meta) చెందిన సోషల్‌మీడియా యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) గురించి తెలియని వారుండరు.

Instagram: రీల్స్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇన్‌స్టా రీల్స్‌ కోసం స్పెషల్ యాప్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ మెటాకు (Meta) చెందిన సోషల్‌మీడియా యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) గురించి తెలియని వారుండరు. టిక్‌టాక్ స్ఫూర్తితో మోటా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను (Reels) ఇంట్రడ్యూస్ చేసింది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు రీల్స్, స్టోరీస్ చేస్తూ, చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ఇన్‌స్టా రీల్స్‌ కోసమే ప్రత్యేకంగా యాప్‌ను తీసుకురావాలని చూస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ఆడమ్‌ మొస్సేరి ఇప్పటికే ఈ విషయాన్ని తమ సిబ్బందికి తెలిపినట్లు సమచారం.

చైనాకు చెందిన ట్రిక్‌టాక్ యాప్‌ను పలు దేశాల్లో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలో కూడా ఈ యాప్‌పై నిషేధం కత్తి వెంటాడుతోంది. ఇక టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌లో 50 శాతం వాటాను అమెరికా సంస్థకు అమ్మేస్తే దానికి అనుకూలంగా నిర్ణయం ఉంటుందని అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 5లోగా దాని భవితవ్యం తేలనుంది. ఈ క్రమంలో టిక్‌టాక్‌కు పోటీగా ఇన్‌స్టా రీల్స్ కోసం కొత్త యాప్‌ను రూపొందించాలనే ఆలోచన ఉంది. ఇక ఈ యాప్‌లో రీల్స్‌లో 3 నిమిషాల వీడియోలు కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, క్రియేటర్ల కోసం గత నెల మెటా ఎడిట్స్‌ యాప్‌ను తీసుకొచ్చింది. క్రియేటర్లు తమ ఐడియాలను సేవ్​ చేసుకోవడానికి ఈ యాప్‌లోనే ఒక ట్యాబ్ ఉంటుంది. మంచి క్వాలిటీ వీడియోలు రికార్డ్​ చేసుకునే కెమెరా సెట్టింగ్స్ అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు అడ్వాన్స్డ్​ ఎడిటింగ్ టూల్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతానికి iOS యూజర్లకు ఈ యాప్‌ అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్‌ యూజర్లకూ అందుబాటులోకి రానుంది. ఒకవేళ రీల్స్‌ యాప్‌ కూడా వస్తే ఈ ఏడాదిలో మెటా నుంచి వచ్చిన రెండో యాప్‌ రీల్స్‌ కానుంది.

Next Story