- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Employees: జీతం కంటే ప్రయోజనాలే ముఖ్యమంటున్న ఉద్యోగులు
ప్రస్తుతం 32 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఇప్పుడున్న ప్రయోజనాలతో కూడిన ప్యాకేజీ పట్ల సానుకూలంగా ఉన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న జీవన వ్యయం, మారుతున్న పనితీరు కారణంగా దేశంలోని చాలామంది ఉద్యోగుల ప్రాధాన్యతలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఓ నివేదిక తెలిపింది. ప్రముఖ స్టాఫింగ్ సొల్యూషన్స్, హెచ్ఆర్ సేవల సంస్థ జీనియస్ కన్సల్టెంట్స్ చేసిన సర్వేలో 74 శాతం మంది కొంచెం తక్కువ జీతం ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనాలు పని చేస్తున్న కంపెనీ నుంచి ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్య బీమా, రిటైర్‌మెంట్ ప్లానింగ్, ఎడ్యుకేషనల్ సపోర్ట్ వంటి దీర్ఘకాల ప్రయోజనాలు కల్పిస్తే కొంత తక్కువ జీతమైనా సరే పనిచేసేందుకు సిద్ధమని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం 32 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఇప్పుడున్న ప్రయోజనాలతో కూడిన ప్యాకేజీ పట్ల సానుకూలంగా ఉన్నారు. 61 శాతం మంది ఇప్పుడు కల్పించే ప్రయోజనాలు సరిపోవని చెప్పారు. 54 శాతం మంది తాము పని చేసే కంపెనీలు వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లను అమలు చేస్తున్నాయి, కాన్నీ మానసిక, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని తెలిపారు. హైబ్రిడ్, రిమోట్ వర్క్ కారణంగా ఆర్థిక విషయాల్లో ఆదాకు అవకాశం ఉందని 84 శాతం మంది చెప్పారు. అలాగే, పనితీరు ఆధారిత బోనస్‌లు, ప్రోత్సాహకాలు ఆర్థిక పరమైన భరోసా కల్పిస్తాయని 73 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు.






