- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TVS నుంచి మరో బైక్.. ధర, ఫీచర్స్ ఇవే
భారత మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. ఇండియన్ మార్కెట్లో.. రకరకాల కంపెనీల

దిశ, వెబ్ డెస్క్ : భారత మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. ఇండియన్ మార్కెట్లో.. రకరకాల కంపెనీల పేరుతో టూ వీలర్ వెహికల్స్ వచ్చేసాయి. సామాన్యులు కూడా కొనుగోలు చేసే ధరలో వాహనాలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే... ఇండియన్ మార్కెట్లోకి టీవీఎస్ కంపెనీ ( TVS) నుంచి సరికొత్త బైక్ మార్కెట్లోకి లాంచ్ అయింది.
టీవీఎస్ మోటార్ కంపెనీ ఆధ్వర్యంలో టీవీఎస్ అపాచీ RTR 310 - 2025 మోడల్ బైక్ ను ( 2025 TVS Apache RTR 310 ) తీసుకువచ్చారు. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. ఇక.. కొత్తగా లాంచ్ అయిన అపాచీ RTR 310 బేస్ మోడల్ ప్రారంభ ధర 2.40 లక్షలు గా ఫిక్స్ చేశారు. ఇది ఎక్స్ షోరూం ప్రకారం మాత్రమే. ఈ ధర... ప్రాంతాలు బట్టి మారుతూ ఉంటుంది. ఇందులో టాప్ మోడల్ బైక్ 2.57 లక్షలుగా ఫైనల్ చేశారు. ప్రస్తుతానికి అయితే ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ బైక్స్ అందుబాటులోకి వచ్చాయి.
కొత్తగా లాంచ్ అయిన అపాచీ RTR 310 బైక్స్ నాలుగు కలర్స్ లో లభిస్తున్నాయి. ఫెరి రెడ్, అర్సనల్ బ్లాక్, ఫురీ ఎల్లో, బ్లూ కలర్స్ లో ఈ బైక్స్ లభిస్తోంది. ఈ బైక్ లో 310 సీసీ ఇంజన్ అమర్చారు. గేర్లను వేగంగా డౌన్ షిఫ్టింగ్ చేస్తున్నప్పుడు... వెనుక చక్రం లాక్ కాకుండా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. 6650 RPM వద్ద 28.7 ఎన్ టార్క్ ను ఈ బైక్ రిలీజ్ చేస్తుంది.






