స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ల మోత.. నిముషానికి 200

by Muthe.Rajitha |

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ విడుదల చేసిన 2025 ఆన్‌లైన్‌ ఆర్డర్‌ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ల మోత.. నిముషానికి 200
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ విడుదల చేసిన 2025 ఆన్‌లైన్‌ ఆర్డర్‌ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్విగ్గీ ఆర్డర్లలో ఎక్కువగా బిర్యానీలే ఉండగా.. ఈ ఏడాది మొత్తం 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయని పేర్కొంది. అంటే నిమిషానికి సగటున 194 బిర్యానీలు ఆర్డర్‌ అవుతున్నట్లు అంచనా వేసింది. వీటిలో చికెన్‌ బిర్యానీ 5.77 కోట్ల ఆర్డర్లతో అగ్రస్థానంలో నిలిచింది. బిర్యానీ తర్వాత బర్గర్లు (4.42 కోట్లు), పిజ్జాలు (4.01 కోట్లు), దోశలు (2.62 కోట్లు) ఎక్కువగా ఆర్డర్‌ అయిన ఆహారపదార్థాలుగా ఉన్నాయి. లంచ్‌ కంటే డిన్నర్‌ సమయంలోనే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని స్విగ్గీ తెలిపింది. అలాగే విదేశీ వంటకాలలో మెక్సికన్‌ (1.6 కోట్లు), టిబెటన్‌ (1.2 కోట్లు), కొరియన్‌ (47 లక్షలు) ఆర్డర్లు వచ్చాయి.

Next Story