దాచేందుకు ఏముంది..? అతనితో మెయింటెన్ చేస్తున్నా: హీరోయిన్ కామెంట్స్

by Web Desk |
దాచేందుకు ఏముంది..? అతనితో మెయింటెన్ చేస్తున్నా: హీరోయిన్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్‌మేకర్ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గంగూబాయి కతియావాడి' థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతుండగా.. చిత్ర ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా పర్సనల్, ప్రొఫెషనల్ కెరీర్ గురించి మాట్లాడిన ఆమె.. రణ్‌బీర్ కపూర్‌తో సంబంధం గురించి వివరించింది.

'ప్రతీ వ్యక్తి తన పర్సనల్ లైఫ్ గురించి బహిరంగంగా మాట్లాడాలని భావించడు. దేశంలోని ప్రతి గోడపై నా రిలేషన్‌షిప్ గురించి ప్లాస్టర్ చేయడం నాకిష్టం లేదు, అయినా ఇందులో దాచడానికి ఏమీ లేదు. నేను రిలేషన్‌షిప్‌లో లేనని అబద్ధం చెప్పను. నా వయస్సు పరంగా కూడా దాన్ని దాచే స్థాయిని దాటాను. రణబీర్‌తో డీప్ లవ్‌లో ఉన్నాను, మేం చాలా సంతోషంగా ఉండటంతో పాటు నా జీవితంలో ఎదురుచూసే వ్యక్తి తాను. 'ప్యార్ కియా తో ఢర్నా క్యా' టైప్ నేను, ఆ కోణంలో కొంచెం రొమాంటిక్‌ని కూడా. కొన్ని సంవత్సరాలుగా మా డేటింగ్ గురించి మాట్లాడకపోవడం వల్ల చాలా సౌకర్యంగా ఉన్నాను' అని ఓపెన్‌గా చెప్పేసింది. 2018 నుంచి రణబీర్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్న అలియా.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతూనే ఉంది.


Next Story

Most Viewed