- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యూనివర్సిటీ ఆవరణలోని చెట్లు పొదల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమై ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నారు. మంటలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందాయి. బాయ్స్ హాస్టల్ సమీపం నుంచి ఎంబీఏ కాలేజీ ఆవరణం వరకూ విస్తరించాయి. ఇక చెట్ల పొదల్లో ప్రమాదం జరగడంతో పెద్దగా ఆస్థినష్టం వాటిల్లనట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం షార్ట్ సర్యూట్ వలన జరిగిందా ? మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.
Next Story






