BREAKING : సింగపూర్ ప్రభుత్వంలో కుదుపు.. అవినీతి కేసులో మంత్రి ఈశ్వరన్‌కు బిగుస్తున్న ఉచ్చు

by Disha Web Desk 1 |
BREAKING : సింగపూర్ ప్రభుత్వంలో కుదుపు.. అవినీతి కేసులో మంత్రి ఈశ్వరన్‌కు బిగుస్తున్న ఉచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్ : రెండు రోజుల క్రితం సింగపూర్‌లో భారత సంతతికి చెందిన రవాణా శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్‌ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన రాజీనామాను ప్రధాని లీ కూడా ఆమోదించారు. ఈ క్రమంలో ఈశ్వరన్‌పై అవినీతి, అక్రమ సంపాదన, అధికార దుర్వినియోగం కేసుల పేరుతో మొత్తం 27 అభియోగాలను నమోదయ్యాయి. అదేవిధంగా సింగపూర్‌లో అత్యంత ధనకుడైన బన్‌సంగ్ అనే వ్యాపారవేత్త నుంచి రూ.2 కోట్ల గ్రాండ్‌ ప్రిక్స్, సాకర్ టిక్కెట్లు లంచంగా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత సంవత్సరం జూలై ఒకసారి జైలుకు వెళ్లి.. వెంటన బెయిల్‌పై విడుదలై పూర్తిగా లీవ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తనపై అభియోగాలు వచ్చిన తరుణంలో నేడు కోర్టు హాజరైన ఈశ్వరన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాను ప్రభుత్వంలో పని చేసిన నాటి నుంచి తీసుకున్న గ్రాంట్లు, వేతనాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. అభియోగాల విషయంలో తానేమి సిగ్గుపడట్లేదని, అవినీతి అరోపణల్లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని అన్నారు. కాగా, చంద్రబాబు‌నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో అప్పట్లో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ కీలకం‌గా వ్యవహరించారు.


Next Story

Most Viewed