ఎయిర్‌ టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ సేవలు ఫ్రీ..

by Web Desk |
ఎయిర్‌ టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ సేవలు ఫ్రీ..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్ టెల్ తమ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఓటీటీల ట్రెండ్ నడుస్తోండటంతో.. ఎయిర్ టెల్ కూడా ఇతర టెలికాం కంపెనీల మాదిరిగా తమ వినియోగదారులకు ఫ్రీగా ఓటీటీ సేవలు అందించనున్నట్లు తెలిపింది. రూ.2,999 ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసిన ఎయిర్‌టెల్.. ఈ ప్లాన్ కింద‌ ఇప్పటి వరకు డేటా, కాల్స్, ఎస్ఎంఎస్‌ల‌ు ఉండగా.. తాజాగా ఇప్పుడు.. రూ.499 విలువ గల డిస్నీ + హాట్ స్టార్ సంవ‌త్సర స‌బ్ స్క్రిప్షన్‌ను ఉచితంగా ఆఫ‌ర్ చేస్తుంది. అంతే కాకుండా.. నెల‌పాటు అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిష‌న్ ఫ్రీ ట్రయ‌ల్‌ను కూడా అందిస్తోంది. ఇక ఎయిర్‌టెల్ రూ.2999 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే.. 356 రోజుల వ్యాలిడిటీ పొంద‌వ‌చ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకు 2 బీజీ డేటా ఈ ప్లాన్‌లో ఆఫ‌ర్ చేస్తుంది.

Next Story