- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా అల్గునూర్ 8వ కార్పొరేషన్ పరిధిలో కరీంనగర్, హైదరాబాద్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న స్కూటర్ ను లారీ ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికి అక్కడే మృతి చెందాడు. టీఎస్ 07 యు హెచ్ 8967 గల లారీ, ఏపి 15 ఏఎక్స్ 5318గల స్కూటీని ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం లో మృతుడు కరీంనగర్ లోని అశోక్ నగర్ కి చెందిన యంసాని వెంకటేశం గా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకొన్న ఎల్ఎండీ ఎసై ప్రమోద్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






