నాయికలు …మీకు బాధ్యత లేదా? : బ్రహ్మాజీ

by  |
నాయికలు …మీకు బాధ్యత లేదా? : బ్రహ్మాజీ
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ప్రభావం మామూలుగా లేదు. జీవితాలను అస్తవ్యస్థం చేసేస్తోంది. తినడానికి తిండి గింజలు లేని కూడా పరిస్థితిని తీసుకొచ్చింది. కూలీలు కడుపునిండా భోజనం చేయలేని దుస్థితిని ఏర్పరిచింది. ఈ క్రమంలో ఎంతో మంది సాయం చేస్తూ అలాంటి వారిని ఆదుకోవడం మానవత్వం మిగిలే ఉందన్న ఆనందాన్నిస్తోంది. సినీ కార్మికులు కూడా కరోనా ప్రభావంతో కష్టాల కడలిని ఈదుతుండగా… వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేశారు. ఈ చారిటీకి సినీ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎంతో మంది కోట్లు, లక్షలు, వేలల్లో తమకు సాధ్యమైనంత విరాళాలు అందించేందుకు ముందుకొచ్చారు. కానీ హీరోయిన్లలో మాత్రం కేవలం లావణ్య త్రిపాఠి మాత్రమే చారిటీకి విరాళం అందించిన వారిలో ఉన్నారు.

దీంతో మండిపోయిన నటుడు బ్రహ్మాజీ కథానాయికలపై కన్నెర చేశాడు. ముంబై నుంచి వచ్చి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పునాదిగా చేసుకుని ఎదుతున్న నాయికలు… పేద కళాకారులు కష్టాల్లో ఉంటే సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడంపై మండిపడ్డారు. కేవలం లావణ్య త్రిపాఠి మాత్రమే ముందుకు వచ్చారని.. మిగిలిన హీరోయిన్లకు పరిస్థితి అర్ధం కావడం లేదా అని ప్రశ్నించారు. ఎంతో కొంత సాయం అందిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

Tags : Brahmaji, CCC, Heroines, Cine Workers, CoronaVirus, Covid19


Next Story