క్రికెట్ ఆడ్డానికి వెళ్లినట్టు లేదు.. విహార యాత్రకు వెళ్లినట్టుంది

by  |
క్రికెట్ ఆడ్డానికి వెళ్లినట్టు లేదు.. విహార యాత్రకు వెళ్లినట్టుంది
X

న్యూజిలాండ్ సిరీస్‌లో వరుస ఓటములపై టీమిండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుని జోరుమీద కనిపించిన టీమిండియా పేలవ ఆటతీరుతో ఓటమిపాలవుతోంది. దీంతో తీవ్ర విమర్శలు కొనతెచ్చుకుంటోంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ జట్టు పేలవ ప్రదర్శనతో ఓటమిపాలు కావడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

టీమిండియా ఆటతీరుపై నిన్నమొన్నటి వరకు ప్రశంసలు కురిపించిన సీనియర్లు, మాజీలు పెదవి విరుస్తున్నారు. న్యూజిలాండ్ టూర్‌ను టీమిండియా సీరియస్‌గా ఆరంభించిందని.. విహారయాత్రగా ముగించాలని భావిస్తోందంటూ మాజీలు మండిపడుతున్నారు. ఈ టూర్‌ను విహారయాత్ర జ్ఞాపకంగా మలచుకుందామని భావిస్తున్నారే తప్ప విజయవంతమైన సిరీస్‌గా మలచుకుందామని భావించడం లేదని వారు ఎద్దేవా చేస్తున్నారని ఆసీస్ మాజీ ఆటగాడు బ్రాడ్ హగ్ విమర్శించాడు.

వన్డేల్లో వైట్ వాష్ అయిన టీమిండియా సీమ్ బంతులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కాలేదని హగ్ మండిపడ్డాడు. రెండో టెస్టుకి ఇంకా నాలుగు రోజుల గడువుంది. ఈ నాలుగు రోజుల్లో పరిష్కారం కనుగోంటారో లేక మళ్లీ పాతకథనే పునరావృతం చేస్తారో చూడాలని ఉత్సుకత వ్యక్తం చేశాడు. తొలి రెండు వారాలు సీరియస్ క్రికెట్ ఆడిన టీమిండియా ఆటగాళ్లు తరువాతి నాలుగు వారాలు విహార యాత్రకు వచ్చినట్టు భావిస్తున్నారని గేలీ చేశాడు.

Next Story